కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్‌గా జగిత్యాల సబ్‌కలెక్టర్ లట్కర్ శ్రీకేష్ బాలాజీరావు నియమితులయ్యారు. ఈ మేర కు జీవో ఆర్టీ నంబర్ 325 ద్వారా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రాజీవ్‌శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
టవర్‌సర్కిల్ : కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్‌గా జగిత్యాల సబ్‌కలెక్టర్ లట్కర్ శ్రీకేష్ బాలాజీరావు నియమితులయ్యారు. ఈ మేర కు జీవో ఆర్టీ నంబర్ 325 ద్వారా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రాజీవ్‌శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నగరపాలక సంస్థకు ఐఏఎస్ స్థాయి అధికారి నియమితులు కావ డం ఇదే తొలిసారి. మహారాష్ట్రకు చెందిన లట్కర్ శ్రీకేశ్ 2011 సివిల్స్ బ్యాచ్‌కు చెందిన వారు.
జగిత్యాల సబ్‌కలెక్టర్‌గా 2013 సెప్టెం బర్ 4 నుంచి పనిచేస్తున్నారు. ఐఏఎస్ అధికారిగా జగిత్యాలలో పలు సంస్కరణలు చేపట్టి ప్రభుత్వ దృష్టిని ఆకర్షించారు. ఐఏఎస్ అధికారిని కరీంనగర్ నగరపాలక సంస్థకు కమిషనర్ కావాలని ఇక్కడి ప్రజాప్రతినిధులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నా ఐఏఎస్‌ల కొరతతో సాధ్యం కాలేదు. శ్రీకేశ్ జగిత్యాలలో పనిచేయడం.. కార్పొరేషన్‌కు కమిషనర్ అవసరం కావడంతో ఇక్కడికి బదిలీ చేశారు.
మాతృసంస్థకు కరోల్ రమేష్..
నగరపాలక సంస్థ కమిషనర్‌గా 2013 ఆగస్టు ఒకటిన డెప్యూటేషన్‌పై బాధ్యతలు చేపట్టిన కరోల్ రమేశ్ కాలపరిమితి 2014 జూలై 31తో ముగిసింది. ఏడాదిపాటు ఎలాంటి ఇబ్బందు లూ లేకుండా ఆయన పదవిలో కొనసాగారు. రమేశ్ హయాంలోనే నగరపాలక సంస్థకు మూడు శానిటేషన్ అవార్డులు వచ్చాయి.
అతి ముఖ్యమైన కార్పొరేషన్ ఎన్నికల ఘట్టం కూడా రమేశ్ చేతుల మీదుగానే జరిగింది. ఆయన డెప్యూటేషన్ గడువును పొడిగిస్తుందని భావించినా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి సంకేతాలూ రాలేదు. ఆయన స్థానంలో ఐఏఎస్ అధికారిని నియమించారు. దీంతో రమేశ్ మాతృ సంస్థ సచివాలయానికి బదిలీపై వెళ్లనున్నారు.