సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా వివాదాలు లేని విలువైన ప్రభుత్వ భూములను గుర్తించి, వెంటనే సమగ్రమైన నివేదికను పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. నిరుపయోగంగా ఉన్న స్థలాలను వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించినందున వేలానికి అనువైన భూముల విషయమై శనివారం ఆయన జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టర్లందరూ జిల్లాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఆయా భూముల ఫొటోలు, మార్కెట్ ధర తదితర అంశాలతో కూడిన నివేదికను వారంలోగా పంపాలన్నారు.
వేలానికి అనువైన భూములను గుర్తించండి: సీఎస్
Published Sun, Jan 4 2015 5:43 AM | Last Updated on Sat, Sep 2 2017 7:13 PM
Advertisement