కొత్త జిల్లాల ఏర్పాటు, రాష్ట్ర అవసరాల దృష్ట్యా తెలంగాణకు అదనం గా ఐఏఎస్‌లను కేటాయించేందుకున్న అవకాశాలను కేంద్రం పరిశీలిస్తోంది.
పరిశీలిస్తున్న కేంద్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటు, రాష్ట్ర అవసరాల దృష్ట్యా తెలంగాణకు అదనం గా ఐఏఎస్‌లను కేటాయించేందుకున్న అవకాశాలను కేంద్రం పరిశీలిస్తోంది. మంగళవారం రాష్ట్రానికి వచ్చిన కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ(డీవోపీటీ) కార్యదర్శి సంజయ్ కొఠారి ఈ అంశంపై చర్చించారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారుల కేటాయింపు, ఉద్యోగుల విభజనపై సచివాలయంలో ఆయ న రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశమయ్యారు. తెలంగాణ సీఎస్ రాజీవ్‌శర్మ, ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావుతోపాటు అన్ని శాఖల ముఖ్యకార్యదర్శులు ఇందులో పాల్గొన్నారు.
అదనంగా 30మంది ఐఏఎస్ అధికారులను కేటాయించాలని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరిన నేపథ్యంలో ఈ సమీక్ష ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రానికి చెంది న ఐఏఎస్ అధికారులు సరిపడా లేనప్పటికీ తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, హరియా ణాకు చెందిన ఐఏఎస్‌లు డిప్యుటేషన్‌పై తెలంగాణలో పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారని సంజయ్ అభిప్రాయపడ్డారు. అంతకుముందే కమలనాథన్ కమిటీతో ఆయన సమావేశమయ్యారు.