
సీఎస్‌తో అమల భేటీ
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నటి అమల మంగళవారం ఉదయం సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను కలిశారు. సీఎస్‌ను కలిసి బయటకు వచ్చిన అమల విలేకరులతో మాట్లాడటానికి నిరాకరించారు.
సీఎంను కలిశారా? సీఎస్‌ను కలిశారా? అని ప్రశ్నించగా సీఎస్‌ను కలిసినట్లు పేర్కొన్నారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్పి కారెక్కి వెళ్లిపోయారు.