sankranti wishes
-
సీఎం జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి అంటేనే అచ్చ తెలుగు పండుగని.. గ్రామానికి నూతన శోభను తెచ్చే పర్వదినమని.. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే రోజని ఆయన అన్నారు. అంతేకాక, పల్లెల పండుగ.. రైతుల పండుగ.. మన పాడిపంటల పండుగ, ప్రజలు తమ స్వగ్రామాలకు వెళ్లి, తమ కుటుంబ, సాంస్కృతిక మూలాలకు విలువఇచ్చే పెద్ద పండుగని ముఖ్యమంత్రి జగన్ అభివర్ణించారు. భోగి మంటలు.. రంగ వల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్లు, పైరుపచ్చల కళకళలు, రైతు లోగిళ్లలో ధాన్యం రాశులు, పిండి వంటల ఘుమఘుమలు, బంధుమిత్రుల సందళ్లతో కనువిందు చేసే మనందరి పండుగ సంక్రాంతి అని పేర్కొన్నారు. పల్లెలన్నీ మళ్లీ కళకళ.. ఇక మనందరి ప్రభుత్వం ఈ 56 నెలల్లోనే ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ, రైతుభరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్‌లు, ప్రభుత్వ బడి, ప్రభుత్వాసుపత్రిలో నాడు–నేడు, ఇంగ్లీషు మీడియం స్కూళ్లు, బ్రాడ్‌బాండ్ సదుపాయంతో డిజిటల్ లైబ్రరీలు, ఒక్క రూపాయి లంచం, వివక్ష లేకుండా ప్రజలకు రూ.2.46 లక్షల కోట్ల డీబీటీ.. ఇంటింటికీ, ప్రతి పేద సామాజికవర్గానికి చరిత్రలో ఎన్నడూలేనంతగా అందిన లబ్ధి.. ఇలా సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలతో పల్లెలు మళ్లీ కళకళలాడేందుకు ఎంతగానో ఉపయోగపడ్డాయని జగన్ తెలిపారు. అలాగే.. ఇంటింటా, రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలోనూ, ప్రతి మారుమూల పల్లెలోనూ, ప్రతి ఒక్క సామాజికవర్గంలోనూ.. నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు, రేపటి కంటే భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధించగలమన్న భరోసా ఇవ్వగలిగితేనే ఇంటింటా సంక్రాంతి అని నమ్ముతూ ఆచరిస్తున్న ప్రభుత్వమిదని ఆయన పేర్కొంటూ రాష్ట్ర ప్రజలందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. -
ఈ సంక్రాంతికి సెలబ్రెటీల సందడి చూశారా?
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంక్రాంతి పండుగ సందడి కనిపిస్తోంది. కరోనా కారణంగా రెండేళ్లు ఎలాంటి సందడి లేకుండ నిరాండబరం జరుపుకున్నారు. ఇక పరిస్థితి సాధారణ స్థితికి రావడంతో సాధారణ ప్రజల నుంచి సనీ సెలబ్రెటీల వరకు మకర సంక్రాంతి కుటుంబాలతో కలిసి స్పెషల్‌గా సెలబ్రెట్ చేసుకుంటున్నారు. ఇక ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువకు సినీ సెలబ్రెటీల తమ అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. చదవండి: ‘నేను అలా అనకూడదు.. కానీ హృతిక్‌ను కించపరచడం నా ఉద్దేశం కాదు’ హీరోహీరోయిన్లు సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతూ సంక్రాంతి స్పెషల్ పోస్ట్స్ షేర్ చేస్తున్నారు. మహేశ్ బాబు కూతురు సితార, అల్లు అర్జున్ ముద్దు తనయ అల్లు అర్హ, స్నేహరెడ్డివ నుంచి తమన్నా, నివేతా థామస్, విజయ్ దేవరకొండ సంక్రాంతి విషెస్ తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరి ఈ సంక్రాంతికి తారల సందడి ఎలా ఉందో ఓ సారి ఇక్కడో లుక్కేయండి! View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) View this post on Instagram A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) -
పెళ్లి తర్వాత హన్సిక తొలి పండుగ.. ఎలా సెలబ్రెట్ చేసుకుందంటే!
పెళ్లయ్యాక వచ్చిన తొలి పండగ సంక్రాంతి సంబరాల్లో ఉన్న హన్సిక తన అభిమానులకు, శ్రేయోభిలాషులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 4న వ్యాపారవేత్త సోహైల్ కతూరియాతో హన్సిక వివాహం జరిగింది. పెళ్లి తర్వాత షూటింగ్స్‌కి కాస్త బ్రేక్ ఇచ్చారామె. ఇక సంక్రాంతి సంబరాల గురించి హన్సిక ఈ విధంగా చెప్పారు. సంక్రాంతి మనందరికీ పెద్ద పండగ. మాకు నార్త్‌లో అయితే 13 నుంచి 16వ తేదీ వరకూ పండగ చేసుకుంటాం. శుక్రవారం లోరీ (భోగి పండగ) జరుపుకున్నాం. లోరీ అంటే మాకు నువ్వుల లడ్డు తప్పనిసరి. హల్వా కూడా చేస్తాం. మా అత్తగారింట్లో సంప్రదాయాలు బాగా పాటిస్తారు. కోడలు హల్వా చేయడం ఆనవాయితీ. సో.. లోరీకి నేనే హల్వా తయారు చేశాను. ఇంకా వేరుశెనగ పప్పుతో బర్ఫీ చేస్తాం. లోరీ మంటలో మరమరాలు, పేలాలు వంటివన్నీ వేస్తాం. అగ్నికి చెడు ఆహుతైపోవాలని, రానున్న రోజులన్నీ బాగుండాలని కోరుకుంటూ, మంట చుట్టూ తిరుగుతామని చెప్పారు. పుట్టిల్లు.. అత్తిల్లు ఒకేచోటే... ‘సంక్రాంతి సందర్భంగా మా అత్తగారు మా పుట్టింటివాళ్లని ఆహ్వానించారు. లోరీ రోజు మా అమ్మవాళ్లు వచ్చారు. పండగ పనులకు అమ్మ సాయం చేశారు. ఆ రోజంతా ఉండి, ఎంజాయ్ చేసి వెళ్లారు. పుట్టిల్లు, అత్తిల్లు ఒకేచోట.. అంటే ముంబైలోనే కావడం ఆనందంగా ఉంది. ఎప్పుడు అనుకుంటే అప్పుడు, ఇలా పండగలప్పుడు కలుసుకునే వీలుంటుంది. గ్రాండ్‌గా పండగ లోరీని ఘనంగా జరిపినట్లే మిగతా మూడురోజుల పండగను కూడా గ్రాండ్‌గా ప్లాన్ చేశాం. నిష్టగా పూజలు చేయడం, పిండి వంటలు చేయడం.. అన్నింటినీ చాలా జాగ్రత్తగా చేస్తున్నాం. ఇక పండగ అంటే ఇతరులను కూడా సంతోషపెట్టాలన్నది నా అభిప్రాయం. నా చిన్నప్పుడే మా అమ్మగారు నాకీ విషయం చెప్పి, ఇతరులకు సహాయపడేలా చేస్తుంటారు. పిల్లలకు కొత్త బట్టలు కొన్నాం ‘మనం మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది’ అని మా అమ్మ అంటుంటారు. అందుకే టీనేజ్‌లో నేను హీరోయిన్ అయ్యాక కొంతమంది పిల్లలను దత్తత తీసుకునేలా చేశారు, ఇప్పుడు మేం మొత్తం 31 మంది పిల్లల ఆలనా పాలనా చూస్తున్నాం. సంక్రాంతి సందర్భంగా పిల్లలందరికీ కొత్త బట్టలు కొన్నాం. స్వీట్లు పంచి పెట్టాం. పిల్లల ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఆ ఆనందం తాలూకు ఆశీర్వాదాలు మనకు అందుతాయి. ఆ దేవుడి ఆశీర్వాదం ఉండటంవల్లే నా జీవితం సాఫీగా సాగిపోతోంది’ అని చెప్పుకొచ్చింది. ఈ 20 నుంచి ఫుల్ బిజీ ‘పెళ్లయ్యాక ప్రొఫెషనల్ లైఫ్‌కి కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చాను. ఈ మధ్యే యాడ్ షూట్స్‌లో పాల్గొన్నాను. ఇక ఈ నెల 20న నుంచి గ్యాప్ లేకుండా షూటింగ్ చేయబోతున్నాను. దాదాపు ఏడు సినిమాలు కమిట్ అయ్యాను. రెండు వెబ్ సిరీస్‌లు ఉన్నాయి. వీటితో బిజీ అయిపోతాను కాబట్టి ఈ పండగను వీలైనంత ప్రశాంతంగా జరుపుకుంటున్నాను. మరోవైపు మా ఆయన కూడా తన బిజినెస్ పనులతో బిజీ అయిపోతారు. ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్‌ని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాలని ఇద్దరం మాట్లాడుకున్నాం. మరోసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఆ దేవుడి దయ వల్ల అందరి జీవితాలూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ సంక్రాంతి శుభకాంక్షలు తెలిపింది. -
ఈ సంక్రాంతి మాకు కొత్త ఆరంభం: ఉపాసన స్పెషల్ పోస్ట్
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మెగా కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన ఓ స్పెషల్ పోస్ట్‌ను షేర్ చేశారు. ఈ సంక్రాంతి తనకు చాలా ప్రత్యేకమని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. అలాగే తెలుగు ప్రజలకు, మెగా ఫ్యాన్స్‌కి ఆమె మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఉపాసన తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె మాతృత్వ క్షణాలను ఆస్వాధిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ తనకు ఈ ఏడాది చాలా ముఖ్యమైందని చెప్పుకొచ్చారు. చదవండి: తెలుగు ప్రజలకు చిరంజీవి సంక్రాంతి శుభాకాంక్షలు ‘ఈ సంక్రాంతి నాకు చాలా ప్రత్యేకం. ఎందుకుంటే ప్రస్తుతం నేను మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ దశను నేను సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఇది మా అందరికి కొత్త ఆరంభం’ అంటూ ఉపాసన రాసుకొచ్చారు. కాగా 2012లో రామ్ చరణ్-ఉపాసనలు పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. దాదాపు పదేళ్ల తర్వాత చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. దీంతో రామ్ చరణ్ తండ్రి కాబోతుండటంతో మెగా ఫ్యాన్స్ అంతా ఫల్ ఖుషి అవుతున్నారు. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
తెలుగు ప్రజలకు చిరంజీవి సంక్రాంతి శుభాకాంక్షలు
తెలుగు ప్రజలకు, తన అభిమానులకు మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. నేడు మకర సంక్రాంతి సందర్భంగా చిరంజీవి ట్వీట్ చేశారు. ‘అందరికీ పచ్చ తోరణాల, ముంగిట ముగ్గుల, మకర సంక్రాంతి శుభాకాంక్షలు! సంవత్సరం పొడుగునా అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు, పాడి పంటలు, భోగ భాగ్యాలు లోడింగ్ (LOADING) అవుతూనే ఉండాలి’ అని రాసుకొచ్చారు. కాగా ఆయన నటించి లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య సంక్రాంతి కానుకగా శుక్రవారం విడుదలై థియేటర్లో సందడి చేస్తోంది. రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచే ఈ మూవీ హిట్‌టాక్‌ను తెచ్చుకుంది. ఈ సినిమాలో చిరు మాస్ లుక్, యాక్షన్ సీన్స్, కామెడీ ప్రేక్షకుల ఫిదా అవుతున్నారు. ఈ సినిమా చూసి అభిమానులంతా బాస్ ఈజ్ బ్యాక్ అంటూ చిరుకి థియేటర్లో నీరాజనాలు పలుకున్నారు. అందరికీ పచ్చ తోరణాల, ముంగిట ముగ్గుల, మకర సంక్రాంతి శుభాకాంక్షలు! సంవత్సరం పొడుగునా అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు, పాడి పంటలు, భోగ భాగ్యాలు 'LOADING ' అవుతూనే వుండాలి !💐💐 #HappySankranti — Chiranjeevi Konidela (@KChiruTweets) January 15, 2023 -
పుట్టిల్లు, అత్తిల్లు ఒకేచోట కావడం ఆనందంగా ఉంది: హన్సిక
పెళ్లయ్యాక వచ్చిన తొలి పండగ సంక్రాంతి సంబరాల్లో ఉన్న హన్సిక తన అభిమానులకు, శ్రేయోభిలాషులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 4న వ్యాపారవేత్త సోహైల్ కతూరియాతో హన్సిక వివాహం జరిగింది. పెళ్లి తర్వాత షూటింగ్స్‌కి కాస్త బ్రేక్ ఇచ్చారామె. ఇక సంక్రాంతి సంబరాల గురించి హన్సిక ఈ విధంగా చెప్పారు. సంక్రాంతి మనందరికీ పెద్ద పండగ. మాకు నార్త్‌లో అయితే 13 నుంచి 16వ తేదీ వరకూ పండగ చేసుకుంటాం. శుక్రవారం లోరీ (భోగి పండగ) జరుపుకున్నాం. లోరీ అంటే మాకు నువ్వుల లడ్డు తప్పనిసరి. హల్వా కూడా చేస్తాం. మా అత్తగారింట్లో సంప్రదాయాలు బాగా పాటిస్తారు. కోడలు హల్వా చేయడం ఆనవాయితీ. సో.. లోరీకి నేనే హల్వా తయారు చేశాను. ఇంకా వేరుశెనగ పప్పుతో బర్ఫీ చేస్తాం. లోరీ మంటలో మరమరాలు, పేలాలు వంటివన్నీ వేస్తాం. అగ్నికి చెడు ఆహుతైపోవాలని, రానున్న రోజులన్నీ బాగుండాలని కోరుకుంటూ, మంట చుట్టూ తిరుగుతాం. పుట్టిల్లు.. అత్తిల్లు ఒకేచోటే... సంక్రాంతి సందర్భంగా మా అత్తగారు మా పుట్టింటివాళ్లని ఆహ్వానించారు. లోరీ రోజు మా అమ్మవాళ్లు వచ్చారు. పండగ పనులకు అమ్మ సాయం చేశారు. ఆ రోజంతా ఉండి, ఎంజాయ్ చేసి వెళ్లారు. పుట్టిల్లు, అత్తిల్లు ఒకేచోట.. అంటే ముంబైలోనే కావడం ఆనందంగా ఉంది. ఎప్పుడు అనుకుంటే అప్పుడు, ఇలా పండగలప్పుడు కలుసుకునే వీలుంటుంది. గ్రాండ్‌గా పండగ లోరీని ఘనంగా జరిపినట్లే మిగతా మూడురోజుల పండగను కూడా గ్రాండ్‌గా ప్లాన్ చేశాం. నిష్టగా పూజలు చేయడం, పిండి వంటలు చేయడం.. అన్నింటినీ చాలా జాగ్రత్తగా చేస్తున్నాం. ఇక పండగ అంటే ఇతరులను కూడా సంతోషపెట్టాలన్నది నా అభిప్రాయం. నా చిన్నప్పుడే మా అమ్మగారు నాకీ విషయం చెప్పి, ఇతరులకు సహాయపడేలా చేస్తుంటారు. పిల్లలకు కొత్త బట్టలు కొన్నాం ‘మనం మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది’ అని మా అమ్మ అంటుంటారు. అందుకే టీనేజ్‌లో నేను హీరోయిన్ అయ్యాక కొంతమంది పిల్లలను దత్తత తీసుకునేలా చేశారు, ఇప్పుడు మేం మొత్తం 31 మంది పిల్లల ఆలనా పాలనా చూస్తున్నాం. సంక్రాంతి సందర్భంగా పిల్లలందరికీ కొత్త బట్టలు కొన్నాం. స్వీట్లు పంచి పెట్టాం. పిల్లల ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఆ ఆనందం తాలూకు ఆశీర్వాదాలు మనకు అందుతాయి. ఆ దేవుడి ఆశీర్వాదం ఉండటంవల్లే నా జీవితం సాఫీగా సాగిపోతోంది. ఈ 20 నుంచి ఫుల్ బిజీ పెళ్లయ్యాక ప్రొఫెషనల్ లైఫ్‌కి కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చాను. ఈ మధ్యే యాడ్ షూట్స్‌లో పాల్గొన్నాను. ఇక ఈ నెల 20న నుంచి గ్యాప్ లేకుండా షూటింగ్ చేయబోతున్నాను. దాదాపు ఏడు సినిమాలు కమిట్ అయ్యాను. రెండు వెబ్ సిరీస్‌లు ఉన్నాయి. వీటితో బిజీ అయిపోతాను కాబట్టి ఈ పండగను వీలైనంత ప్రశాంతంగా జరుపుకుంటున్నాను. మరోవైపు మా ఆయన కూడా తన బిజినెస్ పనులతో బిజీ అయిపోతారు. ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్‌ని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాలని ఇద్దరం మాట్లాడుకున్నాం. మరోసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఆ దేవుడి దయ వల్ల అందరి జీవితాలూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. -
ప్రజల్లో సంక్రాంతి సంతోషం నింపాలి: గవర్నర్ తమిళిసై
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పర్వదినం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పంట చేతికి వచ్చిన సమయంలో జరిగే ఈ పండుగ ప్రతీ ఒక్కరిలో సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. మన గొప్ప సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తూ, కొత్త వస్త్రాలతో పిల్లాపాపలంతా సుఖసంతోషాలతో సంక్రాంతి పండుగను జరుపుకోవాలని కోరారు. -
సంక్రాంతి ఆనంద సిరులు కురిపించాలి: రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ప్రజలకు టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ప్రజలంతా సంతోషంగా జరుపుకోవాలని, ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనంద సిరులు కురిపించాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
సంజయ్ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి విశ్వమంగళ దినమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. తెలుగు ప్రజలకు ఆయన భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చి ఎనిమిదేళ్లయినా, ధనిక రాష్ట్రం అప్పుల తెలంగాణగా మారినా ప్రజల జీవితాల్లో మాత్రం మార్పు రాలేదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
వ్యవసాయం పండుగైన నాడే సంపూర్ణ సంక్రాంతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యవసాయ రంగంలో సాధించిన విప్లవాత్మక ప్రగతి స్ఫూర్తితో యావత్ దేశ రైతాంగానికి వ్యవసాయం పండుగైన నాడే భారతదేశానికి సంపూర్ణ క్రాంతి చేకూరుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగలను పురస్కరించుకుని దేశ, రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. పంటపొలాల నుంచి ధాన్యపు రాశులు ఇళ్లకు చేరుకున్న శుభసందర్భంలో రైతన్న జరుపుకునే సంబురమే సంక్రాంతి పండుగని, నమ్ముకున్న భూతల్లికి రైతు కృతజ్ఞతలు తెలుపుకునేరోజే సంక్రాంతి పండుగ అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని పునరుజ్జీవింప చేసేందుకు చేపట్టిన కార్యాచరణతో తెలంగాణ పల్లెలు పచ్చని పంటపొలాలు, ధాన్యరాశులు, పాడి పశువులు, కమ్మని మట్టివాసనలతో సంక్రాంతి శోభను సంతరించుకుని వైభవోపేతంగా వెలుగొందుతున్నాయని పేర్కొన్నారు. వ్యవసాయరంగ బలోపేతానికి లక్షలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని అన్నారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఇప్పటివరకు రూ. 2,16,000 కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని, రైతు సంక్షేమం పట్ల ప్రభుత్వానికున్న నిబద్ధతకు ఇది తార్కాణమని పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావం నాటికి కోటీ 31 లక్షల ఎకరాలు మాత్రమే ఉన్న సాగు విస్తీర్ణం, ఇప్పుడు 2 కోట్ల 4 లక్షల ఎకరాలకు పెరిగిందన్నారు. వ్యవసాయరంగాన్ని నమ్ముకుంటే జీవితానికి ఢోకా లేదనే విశ్వాసం తెలంగాణ రైతుల్లో తొణికిసలాడుతున్నదని, దీన్నే దేశ రైతాంగంలో పాదు కొల్పుతామని స్పష్టం చేశారు. ఈ దిశగా యావత్ భారత ప్రజల సహకారం, సమష్టి కృషితో దేశ వ్యవసాయరంగంలో గుణాత్మక అభివృద్ధికి బాటలు వేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలంతా మకర సంక్రాంతి పండుగను సుఖసంతోషాలు, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, ప్రతీ ఇల్లు సిరిసంపదలతో తులతూగాలని ఆకాంక్షించారు. -
తెలుగు ప్రజలకు సీఎం జగన్ సంక్రాంతి ప్రత్యేక శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ సంక్రాంతి అని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా.. ‘రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మన @YSRCParty కుటుంబానికి నా ప్రత్యేక శుభాకాంక్షలు. మన పల్లెలు ధాన్యాగారాలుగా, ఇంగ్లీష్ విద్యకు నెలవుగా, ఆరోగ్యచికిత్సలకు కేంద్రంగా, మన పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేలా విప్లవాత్మక కార్యక్రమాలు అమలవుతున్నాయి. సంక్రాంతిని అవి మరింత ద్విగుణీకృతం చేస్తాయని విశ్వసిస్తున్నాను’ అని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మన @YSRCParty కుటుంబానికి నా ప్రత్యేక శుభాకాంక్షలు. — YS Jagan Mohan Reddy (@ysjagan) January 14, 2023 -
తెలుగు ప్రజలకు సీఎం వైఎస్ జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ‘సంక్రాంతి పల్లెల పండుగ.. రైతుల పండుగ.. మన అక్కచెల్లెమ్మల పండుగ.. మొత్తంగా మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే అచ్చ తెలుగు పండుగ’ అని అన్నారు. భోగి మంటలు, రంగ వల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్లు, పైరు పచ్చల కళకళలు గ్రామాల్లో సంక్రాంతి శోభను తీసుకువచ్చాయని చెప్పారు. భోగి.. సంక్రాంతి.. కనుమ పండుగలను ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబం సంతోషంగా జరుపుకోవాలని అభిలషించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ మకర సంక్రాంతి మరింత ప్రగతితో కూడిన మార్పు తీసుకురావాలని, పండుగ సంబరాలతో తెలుగు లోగిళ్లలో, ప్రతి ఇంటా ఆనందాల సిరులు వెల్లి విరియాలని ఆకాంక్షించారు. చదవండి: (మీరు కలిసొచ్చినా రాజకీయంగా మరణమే: అంబటి రాంబాబు) -
సింగపూర్‌లో అంబరాన్నంటిన సంక్రాంతి సంబురాలు
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వారు సంక్రాంతి సంబురాలను 15 జనవరి న ఆన్లైన్ లో జూమ్ ద్వారా కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాటలు మరియు నృత్యాలు ఎంతో అలరించాయి . దీంతో పాటు ముగ్గుల పోటీలు నిర్వహించి ఆన్లైన్ వోటింగ్ ద్వారా ఎన్నుకున్న ముగ్గులకు బహుమతులు అందజేస్తున్నారు. సంబురాల్లో భాగంగా చిన్నారులు వేసిన హరిదాసు వేష ధారణలు ప్రధాన ఆకర్షణ గ నిలిచాయి. ఈ సందర్భంగా సింగపూర్ కాలమాన ప్రకారం జ్యోతిష్యుల చేప్రత్యేకంగా ముద్రించిన క్యాలెండర్ ను విడుదల చేయడం జరిగింది. పండుగల ను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ భావితరాలకు మన పండుగల ప్రాముఖ్యత ని తెలియజేస్తున్నందు కు ఎంతో సంతోషం గ ఉందని సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా, సంబరాలకు చేయూత మరియు సహాయ సహకారాలు అందిస్తున్న వారందరికి TCSS కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సంబురాలను ఆన్లైన్ లో వేలాది మంది వీక్షించారు. సంబరాలు విజయవంతంగా జరుగుటకు సహయo అందించిన దాత లకు, స్పాన్సర్స్ కు మరియు ప్రతి ఒక్కరికి TCSS అధ్యక్షులు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి మరియు సంస్థాగత కార్యదర్శి గడప రమేష్ బాబు మొదలగు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పాటల సమన్వయకర్తలుగా రోజా రమణి, సునీత రెడ్డి, రజిత గోనె, హరిత విజాపూర్, వందన కాసర్ల మరియు రవి కృష్ణ విజాపూర్ వ్యవరించారు. ఈ పేజీలో జూలూరి సంతోష్ కుమార్ గారు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా సొసైటీ కోశాధికారి కల్వ లక్ష్మణ్ రాజు, ఉపాధ్యక్షులు గర్రెపల్లి శ్రీనివాస్, గోనె నరేందర్ రెడ్డి, భాస్కర్ గుప్త నల్ల, మిర్యాల సునీత రెడ్డి, ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్, జూలూరి సంతోష్, నంగునూరి వెంకట రమణ, మరియు కార్యవర్గ సభ్యులు నడికట్ల భాస్కర్, శ్రీధర్ కొల్లూరి, పెరుకు శివ రామ్ ప్రసాద్, గార్లపాటి లక్ష్మా రెడ్డి, అనుపురం శ్రీనివాస్, శివ ప్రసాద్ ఆవుల, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్, కాసర్ల శ్రీనివాస్ మరియు ప్రవీణ్ మామిడాల గార్లు సంబరాల్లో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. -
నేను త్వరగా చనిపోవాలి.. ఆర్జీవీ షాకింగ్ ట్వీట్లు
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తరచూ వివాదాలను పలకరిస్తూ ఉంటాడు. ఏ విషయంపై అయినా వ్యంగ్యంగా స్పందిస్తూ తనదైన శైలిలో కామెంట్ చేస్తుంటాడు. అలా ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఆర్జీవీ ఏ ఒక్కరిని వదలడు. అందరిపై ఒకేలా తన వ్యంగ్యస్త్రాలు సంధిస్తుంటాడు. అలాగే తనకు పండుగలకు పబ్బాలకు శుభాకాంక్షలు చెప్పడం కూడా నచ్చదు. నచ్చదన్న పని ఎవరూ చేయారు. కానీ అలా చెప్పినట్లుగా చేస్తే అతను ఆర్జీవి ఎందుకు అవుతాడు. అవును ఏ పండుగకు విష్ చేయని రామ్ గోపాల్ వర్మ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తన వజ్రాయుధం ట్వీటర్ ద్వారా వరుస ట్వీట్లు చేస్తూ అందరికీ మేలు జరగాలని కోరాడు. 'అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు అంబానీని మించిన ఇల్లు, డబ్బు రావాలి. మీకు ఇప్పుడు, ఎప్పుడూ ఎలాంటి వైరస్ సోకకూడదు అబ్బాయిలకు అందమైన అమ్మాయిలు, అమ్మాయిలకు అందమైన అబ్బాయిలు దొరకాలి'. 'భర్తలను భార్యలు వేధించకూడదు. మీరు ఏం చేసినా ఏం చేయకున్నా మీతో మీ భార్యలు బాగుండాలి.' 'చిన్న సినిమా దర్శక నిర్మాతలకు సంక్రాంతి శుభాకాంక్షలు. మీ చిన్న సినిమాలు బాహుబలి కంటే పెద్ద హిట్ కావాలి.' 'నన్ను ద్వేషించే వారికోసం నేను త్వరగా చనిపోవాలి. అంటూ వరుస ట్వీట్లతో సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పాడు ఆర్జీవీ. Happy Sankranthri to all and may god bless each and everyone of u with a bigger house and more money than Mukesh Ambani and may no virus present or future infect u and may all men get the most beautiful woman in world and all women get most handsome man🙏💐 — Ram Gopal Varma (@RGVzoomin) January 14, 2022 Happy Sankranthri to all husbands and may god grant ur wish that ur wives will never nag u and they will be okay with whatever u do or u don’t do 🙏💐 — Ram Gopal Varma (@RGVzoomin) January 14, 2022 Happy Sankranthri to all small film makers and may each and every one of ur small films become a much bigger hit than Bahubali 🙏💐💪 — Ram Gopal Varma (@RGVzoomin) January 14, 2022 Happy Sankranthri to all my haters and may god grant ur wish that I will die asap 😎😎😎💐💐💐 — Ram Gopal Varma (@RGVzoomin) January 14, 2022 ఇదీ చదవండి: అందరూ పోతారు కానీ.. ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు -
‘సంక్రాంతి శుభాకాంక్షలు.. జాగ్రత్తగా ఉండండి’
తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహించే పండుగలలో సంక్రాంతి ఒకటి. ఈ పండుగను దక్షిణ భారతదేశంలో అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఇప్పటికే ప్రతి పల్లెల్లో భోగి మంటలతో సంబరాల సందడి నెలకొంది. చిన్న పెద్దలంతా ఒక్కచోట చేరి సరదాలతో సమయం గడుపతున్నారు. రంగవల్లులు, గొబ్బెమ్మలు, హరిదాసుల కీర్తనలు, డూడూ బసవన్నల దీవెనలు, జంగమదేవరల జేగంటలు, ఢమరుక నాదాలూ.. పిట్టలదొరల బడాయి మాటలతో మార్మోగుతున్నాయి. ఇదిలా ఉండగా గురువారం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని టాలీవుడ్ స్టార్స్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలో చిరంజీవి, మహేష్‌బాబు, సమంత, జూనియర్ ఎన్టీఆర్,రకుల్ ప్రీత్‌సింగ్ వంటి వారు తమ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అంతేగాక కరోనా నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చదవండి: సంక్రాంతి సంబరాలతో పల్లెసీమలు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు Wishing Everyone A Happy Sankranthi — Jr NTR (@tarak9999) January 14, 2021 Happy Sankranthi to each and everyone of you . May this festival bring more brightness into your lives . pic.twitter.com/cbgBadrufq — Allu Arjun (@alluarjun) January 14, 2021 ‘అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు! భోగ భాగ్యాల ఈ సంక్రాంతి అందరి ఇంట కలల పంట పండించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యపీ సంక్రాంతి’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. అదే విధంగా ‘మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు’ అని మహేష్ ట్వీటర్లో తెలిపారు. అలాగే దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. వివిధ భాషల్లో ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ వరుస ట్వీట్లు చేశారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు! భోగ భాగ్యాల ఈ సంక్రాంతి అందరి ఇంట కలల పంట పండించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ! #HappySankranti ! pic.twitter.com/0o1xqVWAJD — Chiranjeevi Konidela (@KChiruTweets) January 14, 2021 మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు🙏 Be responsible, be safe! 😊 pic.twitter.com/ohvRGPKXwD — Mahesh Babu (@urstrulyMahesh) January 14, 2021 Wishing you all a very happy Sankranti!!💐🙏 — Nagarjuna Akkineni (@iamnagarjuna) January 14, 2021 Happy Pongal/Sankranti .. let’s make it a day of gratitude .. how wonderful it is to just be alive 🙏🤗 #HappyPongal #HappyMakarSankranti — Samantha Akkineni (@Samanthaprabhu2) January 14, 2021 To all of you 😃 Happy Sankranti ❤️❤️ pic.twitter.com/zTXt4H5xSB — Rakul Singh (@Rakulpreet) January 14, 2021 -
రైతుల ఇంట ఆనందాలు వెల్లివిరియాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ భోగి, మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం ఆయన ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘ రాష్ట్ర ప్రజలందరికీ భోగి, మకరసంక్రాంతి శుభాకాంక్షలు. మన సంస్కృతి సంప్రదాయాలకు,సొంత గ్రామాల మీద మమకారానికి, రైతులకు ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి. పండుగ సంబరాలతో తెలుగులోగిళ్లు శుభాలకు, సుఖసంతోషాలకు నెలవు కావాలని,రైతుల ఇంట ఆనందాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. ( సేంద్రీయ సాగు రైతులకు మేలు ) రాష్ట్ర ప్రజలందరికీ భోగి, మకరసంక్రాంతి శుభాకాంక్షలు. మన సంస్కృతి సంప్రదాయాలకు,సొంత గ్రామాల మీద మమకారానికి, రైతులకు ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి. పండుగ సంబరాలతో తెలుగులోగిళ్లు శుభాలకు, సుఖసంతోషాలకు నెలవు కావాలని,రైతుల ఇంట ఆనందాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను#Sankranthi — YS Jagan Mohan Reddy (@ysjagan) January 13, 2021 -
తెలుగు ప్రజలకు సీఎం జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగి మంటలు, రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు.. గాలిపటాల సందళ్లు, పైరుపచ్చల కళకళలు గ్రామాల్లో సంక్రాంతి శోభను తీసుకువచ్చాయన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాల మీద మమకారానికి, రైతాంగానికి మనమంతా ఇచ్చే గౌరవానికి, మన ప్రత్యేకమైన కళలకు ఈ సంక్రాంతి పండగ ప్రతీక అని పేర్కొన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న మాటకు కట్టుబడి దేశచరిత్రలో ఏ రాష్ట్రంలోనూ కనీవినీ ఎరుగని విధంగా గత 19 నెలలుగా మన రైతన్న సంక్షేమానికి, మన గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకున్నామని సీఎం తెలిపారు. ఇక మీదట ఇదే విధానం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను సంతోషంగా జరుపుకోవాలని సీఎం జగన్ ఆకాక్షించారు. ఈ మేరకు సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. (చదవండి: బండారు దత్తాత్రేయను కలిసిన సీఎం వైఎస్ జగన్) -
బ్యూటిఫుల్ ముగ్గు వేశారు: నాగార్జున
హైదరాబాద్ : సంక్రాంతి పండుగ సందర్భంగా అభిమానులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నటీనటులు సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు పండుగ విషెష్ చెబుతున్నారు. ప్రముఖ హీరో నాగార్జున... సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పడంతో పాటుగా, తన నివాసంలో వేసిన ముగ్గు దగ్గర సతీమణి అమలతో పాటు దిగిన ఫోటోను ట్విట్ చేశారు. తమవాళ్లు ఇంటిముందు అందమైన సంక్రాంతి ముగ్గు వేశారంటూ ఆయన అభినందించారు. ఇక ప్రిన్స్ మహేష్ బాబు ... మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ‘మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు’ అంటూ ట్విట్ చేశాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్, సాయిధరమ్ తేజ, మంచు మనోజ్, వెన్నెల కిషోర్, ప్రియమణి, కల్యాణ్ రామ్, దర్శకుడు హరీశ్ శంకర్ తదితరులు ట్విట్ చేశారు. -
గవర్నర్ సంక్రాంతి శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ హార్థిక శుభాకాంక్షలు తెలిపారు. పంట కోతల పండుగగా అత్యంత ఉల్లాసంగా, సంతోషంగా ఈ పర్వదినాన్ని జరుపుకోవడం మన సంస్కృతిలో భాగంగా మారిందన్నారు. రైతులకు మేలు జరగాలని, ప్రేమ, అనురాగం, స్నేహబంధం, సోదర భావానికి ఈ పండుగ స్ఫూర్తిదాయకంగా మారాలని ఆయన ఆకాంక్షించారు. -
తస్మాత్ జాగ్రత్త!
పండుగ సందర్భాల్లో ఏమైనా ప్రయాణాలు చేపడితే కాస్తంత అప్రమత్తంగా ఉండాలి. కనీస జాగ్రత్తలు పాటించాలి. ఇంట్లో బంగారు ఆభరణాలు, అధిక మొత్తంలో నగదు, విలువైన వస్తువులు బ్యాంకు లాకర్లో భద్రపరుచుకోవాలి. నివాసం ఉంటున్న ప్రాంతంలో అనుమానితులు ఎవరైనా తిరుగుతున్నట్లు సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. చిన్న పొరపాటుకు తగిన మూల్యాన్ని ఒక్కోసారి చెల్లించుకోవలసిన పరిస్థితులు కూడా ఎదురవుతుంటాయి. మనం నివసిస్తున్న ప్రాంతాల్లో ఎంత వరకు భద్రత ఉంటుందో పరిశీలించుకోవాలి. పోలీసుశాఖ ఏమి చెబుతోందంటే... జిల్లా ఎస్పీ ఏఎస్ ఖాన్ ఆదేశాల మేరకు జిల్లాలో పండుగల నేపథ్యంలో పోలీస్‌శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ముందుగా ఎవరైనా అనుమానితులు ఇళ్ల వద్ద తిరుగుతున్నా సమీపంలో ఉన్న పోలీస్‌వారికి సమాచారాన్ని అందించాలి. ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రజల్లో అవగాహన తీసుకు వస్తున్నారు. పండుగల్లో దూర ప్రాంతాలకు వెళుతున్న నేపథ్యంలో ముందుగానే సమీప పోలీస్‌శాఖకు సమాచారాన్ని అందిస్తే ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక పోలీస్గస్తీని ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడికైనా తప్పనిసరిగా వెళ్లవలసి వస్తే ఇంట్లో ఉన్న విలువైన సామగ్రిని బ్యాంకు లాకర్లో భద్రపరచుకోవల్సిందిగా సూచిస్తున్నారు. సాధ్యమైనంత వ రకు విలువైన వస్తువులు ధరించి తిరగడం మానుకోవాలి. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లవలసి వస్తే సమీపంలో ఉన్న పోలీస్‌శాఖ దృష్టికి తీసుకువస్తే ఆయా ఇళ్ల వద్ద పోలీస్గస్తీని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. -
సంక్రాంతి శుభాకాంక్షలు
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం జిల్లా ప్రజలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అభిమానులకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి బుధవారం ఒక ప్రకటనలో సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికి భోగ భాగ్యాలు కలగాలని సరదాలు ఇచ్చే సంక్రాంతి, కొత్త సంవత్సరంలో సరికొత్తగా అందరికి ఆనందాన్ని ఇవ్వాలని ఆకాంక్షించారు. -
తెలుగు రాష్ట్రాలు శాంతిసౌభాగ్యాలతో వర్థిల్లాలి: వైఎస్ జగన్
హైదరాబాద్ : తెలుగు ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ప్రతి ఒక్కరూ ఆనందంగా పండుగ జరుపుకోవాలన్నారు. అన్నపూర్ణగా పేరుగాంచిన తెలుగు నేల పాడి పంటలకు నెలవు కావాలని వైఎస్ జగన్ అన్నారు. తెలుగు రాష్ట్రాలు శాంతి సౌభాగ్యాలతో వర్థిల్లాలని, ఇరు ప్రభుత్వాలు వ్యవసాయాన్ని పండుగ చేసేందుకు విధివిధానాలు రూపొందించాలని ఆయన కోరారు. -
సీఎస్‌తో అమల భేటీ
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నటి అమల మంగళవారం ఉదయం సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను కలిశారు. సీఎస్‌ను కలిసి బయటకు వచ్చిన అమల విలేకరులతో మాట్లాడటానికి నిరాకరించారు. సీఎంను కలిశారా? సీఎస్‌ను కలిశారా? అని ప్రశ్నించగా సీఎస్‌ను కలిసినట్లు పేర్కొన్నారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్పి కారెక్కి వెళ్లిపోయారు.