సింగపూర్‌లో అంబరాన్నంటిన సంక్రాంతి సంబురాలు | Sankranti Festival In Singapore | Sakshi
Sakshi News home page

తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబురాలు

Published Sat, Jan 15 2022 7:07 PM | Last Updated on Sat, Jan 15 2022 8:32 PM

Sankranti Festival In Singapore - Sakshi

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వారు సంక్రాంతి సంబురాలను 15 జనవరి న ఆన్లైన్ లో  జూమ్ ద్వారా కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాటలు మరియు నృత్యాలు ఎంతో అలరించాయి . దీంతో పాటు ముగ్గుల పోటీలు నిర్వహించి ఆన్లైన్ వోటింగ్ ద్వారా ఎన్నుకున్న ముగ్గులకు బహుమతులు అందజేస్తున్నారు.  సంబురాల్లో భాగంగా చిన్నారులు వేసిన హరిదాసు వేష ధారణలు  ప్రధాన ఆకర్షణ గ నిలిచాయి. ఈ సందర్భంగా సింగపూర్ కాలమాన ప్రకారం జ్యోతిష్యుల చేప్రత్యేకంగా ముద్రించిన క్యాలెండర్ ను విడుదల చేయడం జరిగింది. పండుగల ను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ భావితరాలకు మన పండుగల  ప్రాముఖ్యత ని తెలియజేస్తున్నందు కు ఎంతో సంతోషం గ ఉందని సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా, సంబరాలకు చేయూత మరియు సహాయ సహకారాలు అందిస్తున్న వారందరికి TCSS కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సంబురాలను ఆన్లైన్ లో వేలాది మంది వీక్షించారు.

సంబరాలు విజయవంతంగా జరుగుటకు సహయo అందించిన దాత లకు, స్పాన్సర్స్ కు  మరియు ప్రతి ఒక్కరికి TCSS అధ్యక్షులు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి మరియు సంస్థాగత కార్యదర్శి గడప రమేష్ బాబు మొదలగు వారు  కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ పాటల సమన్వయకర్తలుగా రోజా రమణి, సునీత రెడ్డి, రజిత గోనె, హరిత విజాపూర్, వందన కాసర్ల మరియు రవి కృష్ణ విజాపూర్ వ్యవరించారు. ఈ పేజీలో జూలూరి సంతోష్ కుమార్ గారు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

ఈ సందర్భంగా సొసైటీ  కోశాధికారి కల్వ లక్ష్మణ్ రాజు, ఉపాధ్యక్షులు గర్రెపల్లి శ్రీనివాస్, గోనె  నరేందర్ రెడ్డి, భాస్కర్ గుప్త  నల్ల, మిర్యాల సునీత రెడ్డి,  ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్, జూలూరి సంతోష్, నంగునూరి  వెంకట రమణ, మరియు కార్యవర్గ సభ్యులు  నడికట్ల భాస్కర్, శ్రీధర్ కొల్లూరి, పెరుకు శివ రామ్ ప్రసాద్, గార్లపాటి లక్ష్మా రెడ్డి, అనుపురం శ్రీనివాస్, శివ ప్రసాద్ ఆవుల, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్, కాసర్ల శ్రీనివాస్ మరియు  ప్రవీణ్ మామిడాల  గార్లు సంబరాల్లో పాల్గొన్న  వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement