Sankranti festival day
-
విజయవాడ : వేడుకగా ముందస్తు సంక్రాంతి సంబరాలు (ఫొటోలు)
-
సింగపూర్‌లో అంబరాన్నంటిన సంక్రాంతి సంబురాలు
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వారు సంక్రాంతి సంబురాలను 15 జనవరి న ఆన్లైన్ లో జూమ్ ద్వారా కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాటలు మరియు నృత్యాలు ఎంతో అలరించాయి . దీంతో పాటు ముగ్గుల పోటీలు నిర్వహించి ఆన్లైన్ వోటింగ్ ద్వారా ఎన్నుకున్న ముగ్గులకు బహుమతులు అందజేస్తున్నారు. సంబురాల్లో భాగంగా చిన్నారులు వేసిన హరిదాసు వేష ధారణలు ప్రధాన ఆకర్షణ గ నిలిచాయి. ఈ సందర్భంగా సింగపూర్ కాలమాన ప్రకారం జ్యోతిష్యుల చేప్రత్యేకంగా ముద్రించిన క్యాలెండర్ ను విడుదల చేయడం జరిగింది. పండుగల ను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ భావితరాలకు మన పండుగల ప్రాముఖ్యత ని తెలియజేస్తున్నందు కు ఎంతో సంతోషం గ ఉందని సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా, సంబరాలకు చేయూత మరియు సహాయ సహకారాలు అందిస్తున్న వారందరికి TCSS కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సంబురాలను ఆన్లైన్ లో వేలాది మంది వీక్షించారు. సంబరాలు విజయవంతంగా జరుగుటకు సహయo అందించిన దాత లకు, స్పాన్సర్స్ కు మరియు ప్రతి ఒక్కరికి TCSS అధ్యక్షులు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి మరియు సంస్థాగత కార్యదర్శి గడప రమేష్ బాబు మొదలగు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పాటల సమన్వయకర్తలుగా రోజా రమణి, సునీత రెడ్డి, రజిత గోనె, హరిత విజాపూర్, వందన కాసర్ల మరియు రవి కృష్ణ విజాపూర్ వ్యవరించారు. ఈ పేజీలో జూలూరి సంతోష్ కుమార్ గారు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా సొసైటీ కోశాధికారి కల్వ లక్ష్మణ్ రాజు, ఉపాధ్యక్షులు గర్రెపల్లి శ్రీనివాస్, గోనె నరేందర్ రెడ్డి, భాస్కర్ గుప్త నల్ల, మిర్యాల సునీత రెడ్డి, ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్, జూలూరి సంతోష్, నంగునూరి వెంకట రమణ, మరియు కార్యవర్గ సభ్యులు నడికట్ల భాస్కర్, శ్రీధర్ కొల్లూరి, పెరుకు శివ రామ్ ప్రసాద్, గార్లపాటి లక్ష్మా రెడ్డి, అనుపురం శ్రీనివాస్, శివ ప్రసాద్ ఆవుల, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్, కాసర్ల శ్రీనివాస్ మరియు ప్రవీణ్ మామిడాల గార్లు సంబరాల్లో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. -
బంపర్ ఆఫర్లు
విజయనగరం మున్సిపాలిటీ: తెలుగు ప్రజల పెద్దపండగ సంక్రాంతి. దేశంలో ఎక్కడ ఏ ప్రాంతంలో ఉద్యోగస్తులు, విద్యార్థులు ఉన్నా పండగ సమయానికి సొంత ఊళ్లకు రావడం ఆనవాయితీ. పెద్దపండగ వస్తోందంటే సందడి అంతా ఇంతా కాదు. సంక్రాంతి రావడంతోనే ఏడాదంతా దాచుకున్న డబ్బుతో నూతన వస్త్రాలు, పాదరక్షలు, ఇతర సామగ్రి కొనుగోలు చేస్తారు. ఈ నేపథ్యంలోనే ఏటా మార్కెట్లో డిస్కౌంట్ ఆఫర్లు హడావుడి సృష్టించేవి. అయితే ఈ ఏడాది డిస్కౌంట్ ఆఫర్లకు బదులుగా బంపర్ ఆపర్లు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఇంతవరకు పెట్టిన డిస్కౌంట్ ఆఫర్‌పై వినియోగదారునికి మోజు తీరిపోయిందని గ్ర హించారో ఏమో గానీ..దుకాణదారులు మరికాస్త ముందుకెళ్లి ఒకటి కొనండి..రెండవది ఉచితంగా పొందండి అంటూ వినియోగదారులను ఆకర్షించే పనిలో పడ్డారు. ప్రధానంగా ఏడాది వ్యవధిలో పెళ్లి చేసుకున్న నూతన వధూవరులకు ఈ పండగ వరాలు కురిపిస్తుంది. కొత్త అల్లుళ్లకు, ఇంటి ఆడపిల్లలకు నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, కొత్త వాహనాలు కొనుగోలు చేసి కానుకగా అందించడం అనవాయితీగా వస్తోంది. అంతేకాకుండా ఇంట్లో సందడి చేసే మనుమలు, మనుమరాళ్లకు ఈ పండగలో వారు ఏం కోరితే అది కొనిచ్చి సంతోష పెడుతుంటారు. వీరిని దృష్టిలోపెట్టుకుని వ్యాపారులు ఉచితబహుమతులు, సున్నాశాతం వడ్డీతో సులభవాయిదాల పద్ధతులు ప్రవేశపెట్టి వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. దీంతో షాపులన్నీ కొనుగోలుదారులతో సందడిగా మారాయి. జిల్లాకేంద్రమైన విజయనగరం పట్టణంలో మెయిన్‌రోడ్,కన్యకాపరమేశ్వరి అమ్మవారిఆలయం జంక్షన్, ఉల్లివీధి, కంటోన్మెంట్ బాలాజీ మార్కెట్, ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ తదితర ప్రాంతాల్లో మార్కెట్ రద్దీ నెలకొంది. కొంగొత్త డిజైన్లు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరల్లో ఉండే పలు రకాల వస్త్రాలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ముఖ్యంగా మధ్య, దిగువ తరగతి ప్రజలకు అనువైన ధరల్లో వారి అభిరుచికి తగినట్టు దుస్తులు కొనుగోలుచేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కువగా రెడీమేడ్ దుస్తుల పైనే మొగ్గుచూపుతున్నారు. టీషర్ట్స్,జీన్స్, చుడీదార్, శారీస్ వివిధరకాల ఫ్యాషన్ వస్త్రాలు ఎక్కువగా అమ్ముడవుతు న్నాయి. యువకులను ఆకర్షించేందుకు దేశ ప్రధాని నరేంద్రమోడీ వాడే వస్త్రాల తరహాలో కోటు మోడల్స్ నూతన ఆకర్షణగా ఈ ఏడాది మార్కెట్లో కనిపిస్తున్నాయి. ప్రస్తుతం విజయనగరం మార్కెట్లో రెడీమేడ్ వస్త్రాలు విక్రయించే దుకాణాలు కొనుగోలు దారులతో కిటకిటలాడుతున్నాయి. ఆధ్యాత్మిక గ్రంథాల పంపిణీ విజయనగరం టౌన్ : మతరహిత ఆధ్యాత్మిక గ్రంథాలను మిషన్ తారా విశాల్ ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేస్తున్నట్టు సంస్థ కో ఆర్డినేటర్ హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు. ఆదివారం టీటీడీ కల్యాణ మండపం ఆవరణలో విశాఖ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ఉచితంగా ఆధ్యాత్మిక గ్రంథాలను భక్తులకు పంపిణీ చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలంతా మానసికంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఇ టువంటి పుస్తకాలను చదవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఇప్పటివరకూ పది వేలకు పైగా పుస్తకాలను ఉచి తంగా పంపిణీ చేశామన్నారు.ఈ కార్యక్రమంలో డాక్ట ర్ రంగారావు, ప్రసన్నలక్ష్మి, నిర్మల, వరుణ్, సన, కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి పాతపంటల జాతర
జహీరాబాద్, న్యూస్‌లైన్: సంప్రదాయ పాత పంటలను పరిరక్షించడమే లక్ష్యంగా మండలంలోని పస్తాపూర్‌లో గల డీడీఎస్(డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ) సంక్రాంతి పర్వదినం రోజు నుంచి పాత పంటల జాతరను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. జనవరి 14వ తేదీన జహీరాబాద్ మండలం అల్గోల్ గ్రామంలో ప్రారంభించనున్న ఈ జాతర ఫిబ్రవరి 13వ తేదీన ఝరాసంగం మండలంలోని మాచ్నూరు గ్రామంలో ముగియనుంది. జాతర సందర్భంగా పాత పంటల ప్రాధాన్యత గురించి వివరిస్తారు. అంతరించి పోతున్న పాత పంటలను పరిరక్షించుకుని పల్లె వ్యవసాయాన్ని కాపాడుకునే విధానం గురించి ప్రచారం నిర్వహిస్తారు. సేంద్రియ విధానంలో వ్యవసాయం చేయడం గురించి రైతులకు అవగాహన కల్పిస్తారు. జాతరలో అందంగా అలంకరించిన 16 ఎడ్లబండ్లలో పాత పంటల ధాన్యం, ఆ ధాన్యంతో తయారు చేసిన వంటకాలను ఈ సందర్భంగా ప్రదర్శిస్తారు. గ్రామ గ్రామానా సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తారు. సొంతంగానే విత్తనాల తయారీ ఖరీఫ్, రబీ సీజన్లలో జహీరాబాద్ ప్రాంత రైతాంగం ప్రభుత్వం అందించే విత్తనాల కోసం ఆశపెట్టుకోరు. రైతులు తమ పొలాల్లో పండించుకున్న పంటల్లో నుంచి నాణ్యమైన విత్తనాలను సేకరిస్తారు. ఆ విత్తనాలను ఈత కట్టెతో అల్లిన బుట్టల్లో పోసి, పైభాగంలో మట్టి, పేడ కలిపి మూసివేస్తారు. విత్తనం ధాన్యంతోపాటు వేపాకు, బూడిద కలుపుతారు. విత్తనాలు నాటే సమయం రాగానే వాటిని బయటకు తీసి నాటేందుకు వీలుగా శుభ్రం చేస్తారు. రైతులు విత్తనాలు నాటుకోగా మిగిలిన విత్తనాలను ఇతర రైతులకు ఇచ్చి సహాయ పడతారు. ఈ పద్ధతి కొన్ని సంవత్సరాలుగా సంప్రదాయంగా వస్తోంది. నియోజకవర్గంలోని జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, రాయికోడ్, న్యాల్కల్ మండలాల్లో 68 గ్రామాల్లో మహిళలు డీడీఎస్ ఆధ్వర్యంలో విత్తన బ్యాంకులను ఏర్పాటు చేసుకున్నారు. ప్రముఖుల రాక జాతర ప్రారంభ ఉత్సవాలకు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారని డీడీఎస్ డెరైక్టర్ పి.వి.సతీష్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్యామూల్, బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయ వ్యవసాయ శాఖ ప్రొఫెసర్‌గా పనిచేసిన డాక్టర్ టి.ఎన్.ప్రకాష్, జాతీయ వ్యవసాయ సంశోధన మేనేజ్మెంట్ అకాడమీ జాయింట్ డెరైక్టర్ కల్పన శాస్త్రి, ఆనికో ఉద్యమ నాయకుడు పాండురంగ హెగ్డె, రాష్ట్ర జీవ వైవిద్య మండలి అధ్యక్షుడు డాక్టర్ హంపయ్య, సభ్యుడు జాదవ్, సీనియర్ శాస్త్రవేత్త జి.ఉమాపతి, అల్గోల్ గ్రామ సర్పంచ్ గౌతంరెడ్డి కార్యక్రమంలో పాల్గొననున్నారు. జాతర ఏ రోజు..ఎక్కడంటే పాతపంటల జాతర 14న అల్గోల్‌లో ప్రారంభం అవుతుంది. 15న రాయికోడ్ మండలం పొట్పల్లి, ఎల్గోయి, 16న న్యాల్కల్ మండలంలోని రేజింతల్, గుంజోటి, 17న మెటల్‌కుంట, మల్గి, 18న బసంత్‌పూర్, మిరియంపూర్, 19న కల్బేమల్, చీకుర్తి, అమిరాబాద్, 20న గణేష్‌పూర్, హూసెళ్లి, హుమ్నాపూర్, 22న న్యాల్కల్లో, 23న హుల్గెర, రాఘవాపూర్, 24న టేకూర్, మాటూరు, ఖాంజమాల్‌పూర్, 25న ఇటికెపల్లి, శంశొద్దీన్‌పూర్, 26న నాగ్వార్, 27న రాయికోడ్, 28న గుంతమర్పల్లి, పీపడ్పల్లి, 29న జీర్లపల్లి, ఇందూర్, 30న చీలమామిడి, సంగాపూర్, 31న ఏడాకులపల్లి, కంబాలపల్లి గ్రామాల్లో జరుగుతుంది. ఫిబ్రవరి 1న బిడకన్నె గ్రామంలో, 4న రాయిపల్లి, చిన్నహైదరాబాద్, 5న క్రిష్ణాపూర్, హోతి(బి), 6న పస్తాపూర్, ఇప్పపల్లి, 7న ఖాశీంపూర్, 8న జహీరాబాద్, 13న మాచ్నూరు గ్రామాల్లో జాతర ఉత్సవాలు నిర్వహించనున్నారు. అవగాహన కల్పించేందుకే.. చిరుధాన్యాల ప్రాధాన్యాన్ని చాటి చెప్పేందుకే పాత పంటల జాతరను నిర్వహిస్తున్నామని డీడీఎస్ డెరైక్టర్ పి.వి.సతీష్ పేర్కొన్నారు. సోమవారం ఆయన మండలంలోని పస్తాపూర్ గ్రామంలోని డీడీఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నెల రోజుల పాటు జాతరను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భారత దేశంలోనే గ్రామీణ సమాజాలు, మహిళా రైతులు, చిన్న సన్నకారు రైతుల ఆధ్వర్యంలో నడిచే పండుగల్లో ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిదన్నారు. తమ సంస్థ స్పూర్తితో ప్రస్తుతం ఒరిస్సా, నాగాలాంగ్, గుజరాత్ రాష్ట్రాల్లో సైతం ఇలాంటి జీవవైవిద్య పండుగలు ప్రారంభమయ్యాయన్నారు.