బ్యూటిఫుల్‌ ముగ్గు వేశారు: నాగార్జున | sankranti greetings to those celebrating | Sakshi

బ్యూటిఫుల్‌ ముగ్గు వేశారు: నాగార్జున

Jan 14 2017 9:32 AM | Updated on Jul 15 2019 9:21 PM

బ్యూటిఫుల్‌ ముగ్గు వేశారు: నాగార్జున - Sakshi

బ్యూటిఫుల్‌ ముగ్గు వేశారు: నాగార్జున

సంక్రాంతి పండుగ సందర్భంగా అభిమానులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

హైదరాబాద్‌ : సంక్రాంతి పండుగ సందర్భంగా అభిమానులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నటీనటులు సోషల్‌ మీడియా ద్వారా ప్రేక్షకులకు పండుగ విషెష్‌ చెబుతున్నారు. ప్రముఖ హీరో నాగార్జున... సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పడంతో పాటుగా, తన నివాసంలో వేసిన ముగ్గు దగ్గర సతీమణి అమలతో పాటు దిగిన ఫోటోను ట్విట్‌ చేశారు. తమవాళ్లు ఇంటిముందు అందమైన సంక్రాంతి ముగ్గు వేశారంటూ ఆయన అభినందించారు.

ఇక  ప్రిన్స్‌ మహేష్‌ బాబు ... మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ‘మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు’  అంటూ ట్విట్‌ చేశాడు. అలాగే  జూనియర్‌ ఎన్టీఆర్‌, సాయిధరమ్‌ తేజ, మంచు మనోజ్‌, వెన్నెల కిషోర్‌, ప్రియమణి, కల్యాణ్‌ రామ్‌, దర్శకుడు హరీశ్‌ శంకర్‌ తదితరులు ట్విట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement