బిగ్‌బాస్ ఫినాలే గ్రాండ్‌గా మొదలైంది. ఆదివారం సాయంత్రం 7 గంటలకు ఈ ఎపిసోడ్ స్టార్ మాతో పాటు ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయింది. దాదాపు 105 రోజుల పాటు బుల్లితెర ప్రేక్షకుల అలరించిన సీజన్ 7.. నేటితో ముగియనుంది. ఉల్టా పుల్టా అంటూ వచ్చిన ఏడో సీజన్ గత సీజన్లకు కాస్త భిన్నంగా సాగింది. తొలుత 14 మంది.. ఐదు వారాల తర్వాత మరో 5 మంది హౌస్‌లోకి వెళ్లారు. ఈ సారి తెలిసిన ముఖాలే హౌస్‌లోకి వెళ్లడంతో.. తొలి నుంచే సీజన్ 7పై పాజిటివ్ టాక్ వినిపించింది. టాస్క్‌లు కూడా కొత్తగా ఉండడం.. కంటెస్టెంట్స్ కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్ అందించడంతో సీజన్ 7 సూపర్ హిట్‌గా నిలిచింది.
మేకర్స్ కూడా ఈ సీజన్ పట్ల హ్యాపీగా ఉన్నారు. అందుకే ఫినాలేను మరింత గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. టాలీవుడ్‌కి చెందిన పలువురు స్టార్స్‌ని ఫినాలో భాగస్వామ్యం చేశారు. రవితేజ మొదలు అల్లరి నరేశ్ వరకు ఫినాలే ఈవెంట్‌లో పాల్గొన్నారు. అయితే ఫినాలేకు చీఫ్ గెస్ట్‌గా సూపర్ స్టార్ మహేశ్ బాబు వస్తాడని గత మూడు రోజులుగా వార్తలు వినిపించాయి. మహేశ్ కొత్త సినిమా గుంటూరు కారం సంక్రాంతికి రిలీజ్ ఉండడంతో నిజంగా బిగ్‌బాస్ షోకి వస్తారని అంతా భావించారు.
పలు వెబ్‌సైట్లలో కూడా వార్తలు వచ్చాయి. కానీ అదంతా ఫేక్. ఫినాలేకు మహేశ్ రావడం లేదు. ఈ రోజు విడుదలైన ప్రోమోలు చూస్తే కూడా ఈ విషయం అర్థమైపోతుంది. వాస్తవానికి మహేశ్ బీబీ 7 ఫినాలేకు రావాల్సిందే. కానీ గుంటూరు కారం సినిమా సాంగ్ షూటింగ్ ఉండడంతో రాలేకపోయాడట. ఈ సాంగ్ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలోనే ఉండడం.. మహేశ్ అక్కడికి వెళ్లడంతో అంతా ఫినాలే కోసమే వెళ్లారని భావించారు. కానీ అది ఫేక్ అని మహేశ్ సన్నిహితులు పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం హౌస్‌లో ఉన్న శివాజీ, యావర్, పల్లవి ప్రశాంత్, అర్జున్, ప్రియాంక, అమర్‌దీప్ ఉన్నారు. వీరిలో పల్లవి ప్రశాంత్ సీజన్ 7 విన్నర్‌గా నిలిచినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment