muggu
-
10 వేల చుక్కల ముగ్గు..!
సాక్షి, చిత్తూరు అర్బన్: ముగ్గులు మన సంప్రదాయ చిహ్నాలకు గుర్తులు. చిన్న పిల్లల నుంచి ప్రతీ ఒక్క మహిళ ముగ్గులు వేస్తుంటారు. చిత్తూరు నగరం దుర్గానగర్ కాలనీకు చెందిన సవిత అనే గృహిణి మాత్రం ముగ్గులు వేయడంలో రికార్డులు సృష్టిస్తుంటారు. గత 20 ఏళ్లుగా ముగ్గుల్లో ఉన్న అన్ని కోణాలను విశ్లేషించిన ఈవిడ కొత్తగా ఏదైనా రికార్డు సృష్టించాలనుకున్నారు. శనివారం చిత్తూరు నగరంలోని కట్టమంచిలో ఉన్న కళ్యాణ మండపం ఆవరణలో ఏకంగా 1600 చదరపు అడుగుల విస్తీర్ణంలో 10 వేల చుక్కలతో ముగ్గువేసి సరికొత్త రికార్డు సృష్టించారు. సవిత ఒక్కటే ఏడు గంటల పాటు శ్రమించి ముగ్గు వేయడం అక్కడున్న ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. ముగ్గు మధ్యలో ప్రకృతిని కాపాడాలంటూ ఓ సందేశాన్ని సైతం ఇచ్చారు. ఆమె ముగ్గు వేస్తున్నంతసేపు అక్కడే ఉన్న తెలుగు బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధి శ్రీనివాసులు సవితను మెచ్చుకుంటూ తమ పుస్తకంలో ఆమెకు స్థానం లభించినట్లు పేర్కొన్నారు. ముగ్గు పూర్తయిన తరువాత సవితకు ధృవీకరణ పత్రం అందచేశారు. -
బ్యూటిఫుల్ ముగ్గు వేశారు: నాగార్జున
హైదరాబాద్ : సంక్రాంతి పండుగ సందర్భంగా అభిమానులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నటీనటులు సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు పండుగ విషెష్ చెబుతున్నారు. ప్రముఖ హీరో నాగార్జున... సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పడంతో పాటుగా, తన నివాసంలో వేసిన ముగ్గు దగ్గర సతీమణి అమలతో పాటు దిగిన ఫోటోను ట్విట్ చేశారు. తమవాళ్లు ఇంటిముందు అందమైన సంక్రాంతి ముగ్గు వేశారంటూ ఆయన అభినందించారు. ఇక ప్రిన్స్ మహేష్ బాబు ... మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ‘మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు’ అంటూ ట్విట్ చేశాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్, సాయిధరమ్ తేజ, మంచు మనోజ్, వెన్నెల కిషోర్, ప్రియమణి, కల్యాణ్ రామ్, దర్శకుడు హరీశ్ శంకర్ తదితరులు ట్విట్ చేశారు.