పండుగ సందర్భాల్లో ఏమైనా ప్రయాణాలు చేపడితే కాస్తంత అప్రమత్తంగా ఉండాలి. కనీస జాగ్రత్తలు పాటించాలి. ఇంట్లో బంగారు ఆభరణాలు, అధిక మొత్తంలో నగదు, విలువైన వస్తువులు బ్యాంకు లాకర్‌లో భద్రపరుచుకోవాలి. నివాసం ఉంటున్న ప్రాంతంలో అనుమానితులు ఎవరైనా తిరుగుతున్నట్లు సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. చిన్న పొరపాటుకు తగిన మూల్యాన్ని ఒక్కోసారి చెల్లించుకోవలసిన పరిస్థితులు కూడా ఎదురవుతుంటాయి. మనం నివసిస్తున్న ప్రాంతాల్లో ఎంత వరకు భద్రత ఉంటుందో పరిశీలించుకోవాలి.
పోలీసుశాఖ ఏమి చెబుతోందంటే...
జిల్లా ఎస్పీ ఏఎస్ ఖాన్ ఆదేశాల మేరకు జిల్లాలో పండుగల నేపథ్యంలో పోలీస్‌శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ముందుగా ఎవరైనా అనుమానితులు ఇళ్ల వద్ద తిరుగుతున్నా సమీపంలో ఉన్న పోలీస్‌వారికి సమాచారాన్ని అందించాలి. ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రజల్లో అవగాహన తీసుకు వస్తున్నారు. పండుగల్లో దూర ప్రాంతాలకు వెళుతున్న నేపథ్యంలో ముందుగానే సమీప పోలీస్‌శాఖకు సమాచారాన్ని అందిస్తే ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక పోలీస్‌గస్తీని ఏర్పాటు చేస్తున్నారు.
ఎక్కడికైనా తప్పనిసరిగా వెళ్లవలసి వస్తే ఇంట్లో ఉన్న విలువైన సామగ్రిని బ్యాంకు లాకర్‌లో భద్రపరచుకోవల్సిందిగా సూచిస్తున్నారు. సాధ్యమైనంత వ రకు విలువైన వస్తువులు ధరించి తిరగడం మానుకోవాలి. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లవలసి వస్తే సమీపంలో ఉన్న పోలీస్‌శాఖ దృష్టికి తీసుకువస్తే ఆయా ఇళ్ల వద్ద పోలీస్‌గస్తీని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది.
తస్మాత్ జాగ్రత్త!
Published Thu, Jan 14 2016 12:27 AM | Last Updated on Sun, Sep 3 2017 3:37 PM
Advertisement