be careful
-
అన్నోన్.. డేంజర్‌జోన్
అపరిచిత వ్యక్తులు.. ముఖ్యంగా మహిళల నుంచి మీకు వీడియో కాల్స్ వస్తున్నాయా? అయితే జాగ్రత్త.. వాటికి ఏమాత్రం ఆన్సర్ చేయకండి. చేస్తే అంతే సంగతులు. మరుసటి రోజు నుంచి మీ ఫోన్‌కు మీ నగ్న వీడియోలు పంపుతారు. అలా ఎలా? సాధ్యమని అడగకండి. ఫేస్ మార్పింగ్ యాప్స్ బోలెడు ఉన్నాయి. వాటిని బంధువులు, స్నేహితులకు పంపుతామని, ఇంటర్నెట్లో పెడతామని వేధింపులు మొదలవుతాయి. పోనీ ఓసారి అడిగినంత చెల్లిస్తే అక్కడితో ఆగరు.. ఇంకా కావాలంటూ వేధింపులకు దిగుతారు. కాల్ చేసి.. మేము మీకు తెలిసిన వారమేనని, మనం గతంలో కలిశామంటూ మాట కలుపుతారు. యాంటి కరప్షన్, గుడ్ సొసైటీ అంటూ వాట్సాప్ డీపీలు పెట్టుకుంటారు. ఇదిచూసి మంచి వారేనని కాల్ లిఫ్ట్ చేస్తే.. ఇక అంతే! ఓ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగికి కూడా.. హైదరాబాద్‌లో ఓ ప్రభుత్వ ఉద్యోగికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. యాంటి కరప్షన్ అన్న డీపీ ఉండటంతో ఆయన మాట్లాడారు. మరునాడు ఫోన్ వచ్చింది. అర్జెంటుగా రూ.20వేలు నా నంబర్‌కు గూగుల్ పే చేయి అనగానే.. ఎందుకు? అని నిలదీశాడు. అతన్ని లైన్లో ఉండమని చెప్పి, వాట్సాప్ చూసుకోమన్నాడు. వీడియో చూసి ఆ ఉద్యోగి కంగుతిన్నారు. ఓ మహిళతో తాను సన్నిహితంగా ఉన్న వీడియో చూసి నోటమాటరాలేదు. వెంటనే డబ్బులు చెల్లించారు. లండన్ బాబు దీనగాథ ఇది.. నిజామాబాద్‌కు చెందిన ఓ అబ్బాయి లండన్‌లో చదువుతున్నాడు. అతనికి ఇండియా నుంచి ఈ మధ్య ఓ వీడియో కాల్ వచ్చింది. రెండు రోజులు సరదాగా మాట్లాడాడు. తరువాత అతని వాట్సాప్‌కు ఓ వీడియో క్లిప్‌ను పంపారు. అందులో అతను నగ్నంగా ఉన్న దృశ్యాలు కనిపించాయి. అడిగినంత డబ్బు వెంటనే చెల్లించాలని లేకపోతే.. వీటిని మీ బంధువులకు పంపుతానని బెదిరించారు. ఆ అబ్బాయి వాటికి భయపడలేదు.. ఏమైనా చేసుకో అని గట్టిగా సమాధానమిచ్చాడు. వెంటనే సదరు అబ్బాయి బంధువులు, స్నేహితులతో ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. అందులో వీడియో పోస్టు చేశారు. అప్పుడు భారత కాలమానం ప్రకారం.. రాత్రి 2 గంటలు. లండన్‌లో రాత్రి 10 గంటలు ఈ వ్యత్యాసాన్ని బాగా సొమ్ము చేసుకుంటున్నారు. గంటలోగా డబ్బులు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా చెల్లించకపోతే వీడియో అలాగే ఉంచేస్తామన్నారు. దీంతో ఆ అబ్బాయి వారు అడిగినంత చెల్లిస్తూ పోయాడు. ఈ మధ్య విద్యార్థి డబ్బులు ఇవ్వలేదని ఆ గ్రూపులో వీడియో ఒకటి ఉంచారు. దీంతో బంధువులు, స్నేహితుల వద్ద ఆ యువకుడు తలెత్తుకోలేకపోతున్నానంటూ వాపోతున్నాడు. తాను అలాంటి వాడిని కాను అని మొత్తుకుంటున్నాడు. కొందరు నమ్ముతున్నారు.. కొందరు నమ్మడం లేదు. సోషల్ మీడియా ఖాతాలతో.. ముందు ఎన్నారైలు, ప్రభుత్వ ఉద్యోగులను వీరు టార్గెట్ చేస్తున్నారు. సోషల్ మీడియా ఖాతాల ద్వారా వారి వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నారు. తరువాత వివిధ స్వచ్ఛంద సంస్థల లోగోలతో ఎరవేస్తున్నారు. ప్రతిసారీ రూ.20–30 వేలు అడుగుతున్నారు. ఈ మొత్తానికి పోలీసులకు ఫిర్యాదు చేయరు అన్న ధీమానే దీనికి కారణం. బాధితులు కూడా డబ్బులు పోతే పోనీయని ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. -
బీ కేర్‌ఫుల్
-
బీ కేర్ ఫుల్
-
బీ కేర్‌ఫుల్ 19th Dec 2019
-
కేటుగాళ్లున్నారు ’క్రెడిట్, డెబిట్ కార్డులు’ జాగ్రత్త
-
తస్మాత్ జాగ్రత్త!
పండుగ సందర్భాల్లో ఏమైనా ప్రయాణాలు చేపడితే కాస్తంత అప్రమత్తంగా ఉండాలి. కనీస జాగ్రత్తలు పాటించాలి. ఇంట్లో బంగారు ఆభరణాలు, అధిక మొత్తంలో నగదు, విలువైన వస్తువులు బ్యాంకు లాకర్లో భద్రపరుచుకోవాలి. నివాసం ఉంటున్న ప్రాంతంలో అనుమానితులు ఎవరైనా తిరుగుతున్నట్లు సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. చిన్న పొరపాటుకు తగిన మూల్యాన్ని ఒక్కోసారి చెల్లించుకోవలసిన పరిస్థితులు కూడా ఎదురవుతుంటాయి. మనం నివసిస్తున్న ప్రాంతాల్లో ఎంత వరకు భద్రత ఉంటుందో పరిశీలించుకోవాలి. పోలీసుశాఖ ఏమి చెబుతోందంటే... జిల్లా ఎస్పీ ఏఎస్ ఖాన్ ఆదేశాల మేరకు జిల్లాలో పండుగల నేపథ్యంలో పోలీస్‌శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ముందుగా ఎవరైనా అనుమానితులు ఇళ్ల వద్ద తిరుగుతున్నా సమీపంలో ఉన్న పోలీస్‌వారికి సమాచారాన్ని అందించాలి. ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రజల్లో అవగాహన తీసుకు వస్తున్నారు. పండుగల్లో దూర ప్రాంతాలకు వెళుతున్న నేపథ్యంలో ముందుగానే సమీప పోలీస్‌శాఖకు సమాచారాన్ని అందిస్తే ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక పోలీస్గస్తీని ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడికైనా తప్పనిసరిగా వెళ్లవలసి వస్తే ఇంట్లో ఉన్న విలువైన సామగ్రిని బ్యాంకు లాకర్లో భద్రపరచుకోవల్సిందిగా సూచిస్తున్నారు. సాధ్యమైనంత వ రకు విలువైన వస్తువులు ధరించి తిరగడం మానుకోవాలి. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లవలసి వస్తే సమీపంలో ఉన్న పోలీస్‌శాఖ దృష్టికి తీసుకువస్తే ఆయా ఇళ్ల వద్ద పోలీస్గస్తీని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. -
మంత్రులూ! జాగ్రత్త!
కొన్నేళ్ల క్రితం జార్జి బుష్ మీద బూటు విసిరినందుకు ఒక వ్యక్తిని చాలా సంస్థలు సన్మానించాయి. ఇలాంటి వినూత్న పంథాలో మేమూ ప్రయాణించగలం అన్నట్టు పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్‌లోని ఒక వర్గం రెండు రోజుల క్రితం అపురూప సత్కారం ఒకటి చేసింది. 55 ఏళ్ల జర్నైల్ సింగ్ ఆ అదృష్టానికి నోచుకున్నాడు. నవంబర్ 20న జర్నైల్‌సింగ్ పంజాబ్ వ్యవసాయ మంత్రి సికిందర్ సింగ్ మాలుకాను హమీర్‌గఢ్ అనే గ్రామంలో లాగి లెంపకాయ కొట్టాడు. కారణం ఏమిటి? మతాన్ని అవమానిస్తున్న వారి పట్ల ఆ మంత్రి కఠినంగా వ్యవహరించడం లేదట! జర్నైల్ దెబ్బకి మంత్రి తలపాగా కూడా పడిపోయింది. తరువాత మంత్రిగారి అభిమానులు జర్నైల్‌ను చావగొట్టి, ఆస్పత్రిలో చేర్చారు. పోలీసులు కేసు పెట్టారు. అకాలీదళ్ (బాదల్) వర్గం మతాన్ని రాజకీయాల కోసం భ్రష్టుపట్టిస్తున్నదని జర్నైల్ అంటున్నాడు. ఏమైనా, మంత్రులంతా జాగ్రత్తగా ఉండాలి. -
డెంగీ జ్వరాలపై అప్రమత్తం
క్షేత్రస్థాయికి వెళ్లాలని కమిషనర్‌కు వైద్య శాఖ మంత్రి ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: డెంగీ జ్వరాలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు క్షేత్రస్థాయికి వెళ్లాలని వైద్య విధాన పరిషత్ కమిషనర్ వీణాకుమారిని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ఆదేశించారు. వాస్తవ పరిస్థితిని తెలుసుకొని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలన్నారు. బాధితులను ఆస్పత్రుల్లో చేర్పించాలని ఆయన వైద్య సిబ్బందికి చెప్పారు. ముఖ్యంగా ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని ఏజెన్సీలో పరిస్థితి తీవ్రంగా ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఆయా జిల్లాల్లోని కొన్ని గ్రామాలకు గ్రామాలే డెంగీ బారిన పడినట్లు వారలొచ్చాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రుల్లో డెంగీ నిర్ధారణ పరీక్షలు లేకపోవడంతో పరిస్థితి తీవ్రంగా ఉందని సర్కారు భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఏరియా ఆసుపత్రులకు అవసరమైన పరికరాలు, కిట్లు, ఇతరత్రా నిర్వహణ కోసం ఒక్కో ఆసుపత్రికి రూ. 30 లక్షల చొప్పున రూ. 10.20 కోట్లు గురువారం విడుదల చేసినట్లు వైద్య వర్గాలు తెలిపాయి. ఇదిలావుండగా త్వరలో 12 ప్లేట్లెట్లను లెక్కించే యంత్రాలను కూడా సరఫరా చేయనున్నారు. వీటి సరఫరాకు సంబంధించి ఇప్పటివరకు నెలకొన్న వివాదం పరిష్కారమైనందున అవి ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులోకి రానున్నాయి. జ్వరాలతో బాధపడే ప్రజలను ఆగమేఘాల మీద ఏరియా ఆసుపత్రులకు తీసుకొచ్చి అందుబాటులో ఉన్న నిర్ధారణ పరీక్షలతో ప్రజలను ఆదుకోవాలని మంత్రి లక్ష్మారెడ్డి కోరారు. డెంగీ రాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉం డాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. -
ఆన్లైన్లో జాగ్రత్త సుమా!
తక్కువ ధరకు వస్తోంది కదా అని శ్రీనివాస్ ఆన్లైన్లో ల్యాప్‌టాప్ కొన్నాడు. రెండునెలలు వాడాక బాగా స్లోగా ఉండటంతో హార్డ్‌వేర్ నిపుణుడైన స్నేహితుడికి చూపించగా... దాన్లో నాసిరకం విడిభాగాలున్నట్లు చెప్పాడు. కంపెనీ సర్వీసింగ్ సెంటర్‌కి తీసుకెళ్లి చూపిస్తే అది ఆథరైజ్డ్ డీలర్ వద్ద కొన్నది కాదని, వారంటీ ఇవ్వలేమని చెప్పేశారు. నచ్చకుంటే తిరిగి పంపడానికి ఆన్లైన్ కంపెనీ ఇచ్చిన గడువు అప్పటికి పూర్తయిపోవటంతో చేసేదేమీ లేక తలపట్టుకున్నాడు.సుకుమార్‌ది మరో కథ. ఆన్లైన్లో ఫోన్ కొన్నాడు. ఫోన్ బాగానే ఉంది. వారం రోజులు వాడాక మోజు తీరింది. నచ్చకపోతే తిరిగి పంపడానికి కంపెనీ ఇచ్చిన గడువింకా ఉండటంతో వెనక్కి పంపేశాడు. కంపెనీ తిరిగి తీసుకుని.. డబ్బులు ఆన్లైన్లోనే వెనక్కిచ్చేసింది. సుకుమార్‌కు మొబైల్ పంపిన కంపెనీ (సెల్లర్) నిజానికి పక్కాగా ఒరిజినల్ వస్తువులు పంపేదే. కానీ సుకుమార్ తిరిగి పంపేయటంతో ఆన్లైన్ కంపెనీ నిబంధనల ప్రకారం దాన్ని వెనక్కి తీసుకోక తప్పలేదు. ఆ వస్తువు వాడేసింది కావటంతో పూర్తి ధరకు అమ్ముకునే అవకాశం లేకుండా పోయింది. నష్టపోవటం సెల్లర్ వంతయింది. ఇవండీ ఆన్లైన్ కథలు... నిజానికివన్నీ చిన్నచిన్న సమస్యలే. తక్కువ మందికి పరిమితమైనవే. కానీ ఇప్పుడిప్పుడే వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఈ-కామర్స్ రంగంపై వీటి ప్రభావం మాత్రం తక్కువేమీ కాదు. ఈ-కామర్స్ బూమ్‌ను ఆసరా చేసుకుని కొందరు విక్రేతలు నాసిరకం ఉత్పత్తులను, కొత్తగా మార్చిన పాత ఉత్పత్తులను అంటగడుతున్నారు. కొందరు కస్టమర్లు ప్రొడక్టులో లోపంలేకున్నా.. నచ్చలేదంటూ వెనక్కిచ్చేస్తున్నారు. ప్యాక్‌లో రాళ్లు వచ్చాయనేవారు కొందరైతే... విడిభాగాలను మార్చేసే కస్టమర్లు మరికొందరు. ఇవన్నీ ఈ-కామర్స్ రంగం ముందున్న సవాళ్లు. రిటర్న్స్ పాలసీ మారాలా? ఉత్పత్తికి ఏదైనా నష్టం వాటిల్లినా, లోపమున్నా వెనక్కిచ్చి కొత్తది పొందొచ్చు. డబ్బులూ వెనక్కి పొందొచ్చు. ప్రొడక్ట్ నచ్చకపోయినా మార్చుకోవచ్చు. విభాగం, ఈ-కామర్స్ కంపెనీనిబట్టి కస్టమర్లు 7-30 రోజుల్లో ఉత్పత్తులను వెనక్కి పంపే వీలుంది. కస్టమర్ల డబ్బులకు రక్షణ కల్పించేందుకే ఈ-కామర్స్ కంపెనీలు రిటర్న్స్ పాలసీని పాటిస్తున్నాయి. కస్టమర్లు ఫిర్యాదు చేస్తే విక్రేతలు ఆ ఉత్పత్తిని వెనక్కి తీసుకోవాల్సిందే. లేకపోతే ఆన్లైన్ కంపెనీలు విక్రేతలకు చెల్లింపులను నిలిపివేస్తాయి. ఎలక్ట్రానిక్స్‌లోనే అధిక నకిలీలు... అంతర్జాతీయ బ్రాండ్ల పేరిట నాసిరకం ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు వచ్చేస్తున్నాయి. భారత ఎలక్ట్రానిక్స్ మార్కెట్లో ఈ నకిలీల వాటా 5 శాతంతో రూ.2,500 కోట్ల వరకూ ఉంటుందని అంచనా కాగా ఇది 2015లో రూ.5,600 కోట్లకు చేరుకుంటుందని ఈ మధ్య టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్వయంగా చెప్పారు. నియంత్రణ లేకపోవటంతో ఇవి ఆన్‌లైన్‌లోకి చొరబడుతున్నాయి. ఉదాహరణకు రవికిరణ్ అనే కార్పొరేట్ ఉద్యోగి అలీబాబాకు చెందిన అలీ ఎక్స్‌ప్రెస్.కామ్‌లో రూ.6,500 విలువగల లెనోవో స్మార్ట్‌ఫోన్ బుక్ చేశారు. ఆయనకు నకిలీది రావటంతో కంపెనీకి ఫిర్యాదు చేశాడు. విక్రేత ఆ ఫోన్‌తో పాటు రూ.4 వేలు పరిహారంగా చెల్లించాడు. ఆన్లైన్ కంపెనీలపై ఫిర్యాదులు పెరుగుతున్నాయని, అధీకృత రిటైలర్ల వద్ద కొంటే సమస్యలుండవని సిరి కమ్యూనికేషన్స్ ప్రమోటర్ ఎం.చిరంజీవి, టెక్నోవిజన్ ఎండీ సికందర్ చెప్పారు. మోసాల ప్రభావం ఇదీ... కొందరు కస్టమర్లు విడిభాగాలను మార్చి, ఉత్పత్తి బాగులేదన్న కారణంతో తిరిగి పంపేస్తారు. ఐటీ ఉత్పత్తుల విక్రయాల్లో ఉన్నవారు ఎక్కువగా ఇలాంటివి చేస్తుండటంతో ఐటీ ఉత్పత్తుల దుకాణాలు అధికంగా ఉన్న అమీర్‌పేట, సికింద్రాబాద్ ప్రాంతాలకు డెలివరీ ఇచ్చేందుకు ఈ-రిటైలర్లు నో చెబుతున్నారు. ఆన్లైన్ వల్ల తమ అమ్మకాలు పడిపోయాయని, అందుకే తామూ ఆన్‌లైన్‌లోకి వెళ్లామనేది వ్యాపారి హమీద్ మాట. ఆన్లైన్ ధరల పోటీని తట్టుకోవడానికి ఒకోసారి విడిభాగాలను మారుస్తున్నట్లు అంగీకరించారాయన. ‘‘ఒరిజినల్ 2జీబీ ర్యామ్ రూ.2,500, హార్డ్ డిస్క్ 1 టీబీది రూ.4 వేల దాకా ఉంటుంది. వీటిని మార్చకపోతే మరీ తక్కువ ధరకు అమ్మటం కష్టం’ అన్నారాయన. మరో వ్యాపారి రవీందర్ మాట్లాడుతూ... ‘‘డెల్ ఐ3 3541 మోడల్ డీలర్ ధర రూ.29,500. హైదరాబాద్‌లోని గ్రే మార్కెట్ వ్యాపారులకు రూ.23 వేలకే వస్తోంది. వారు ఆన్లైన్లో తక్కువ లాభానికే అమ్ముతున్నారు’’ అని చెప్పారు. తాము ఒరిజినల్ వస్తువులు విక్రయిస్తున్నా 10 శాతంపైగా వస్తువులు వెనక్కి రావడంతో ఆన్‌లైన్‌కు గుడ్‌బై ెప్పేశామని మొబైల్ వ్యాపారి శ్రీనివాస్ వెల్లడించారు. ‘‘ల్యాప్‌టాప్‌లు 7వేల వరకూ అమ్మితే 1500 వరకూ తిరిగొచ్చేశాయి. వీటిలో అధికం అమీర్‌పేట్, సికింద్రాబాద్ ప్రాంతాలకు డెలివరీ ఇచ్చినవే. అందుకే ఆన్‌లైన్‌కు గుడ్‌బై చెప్పేశాం’’ అన్నారాయన. సీటీసీకి చెందిన 80 శాతం మంది వ్యాపారులు ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ నుంచి తప్పుకున్నట్లు మరో వ్యాపారి నిజాముద్దీన్ చెప్పారు. - హైదరాబాద్, బిజినెస్ బ్యూరో