లొంగిపోయిన నలుగురు మావోయిస్టులకు రూ.35 లక్షల రివార్డును మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
సాక్షి, హైదరాబాద్: లొంగిపోయిన నలుగురు మావోయిస్టులకు రూ.35 లక్షల రివార్డును మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మావోయిస్టు కేంద్ర సాంకేతిక కమిటీ సభ్యుడు, కోల్‌కతాకు చెందిన భాస్కర్ చక్రవర్తి(45)కి రూ.20 లక్షలు, మధ్య జోనల్ కమిటీ సభ్యుడు కుశాల్ యాదవ్, అరవింద్ వర్మలకు చెరో రూ.5 లక్షల చొప్పున రివార్డును మంజూరు చేశారు.
లొంగిపోయిన వారికి పునరావాసంతో పాటు వారి అరెస్టుకు సహకరించిన ఇన్‌ఫార్మర్లకు నజరానాగా ఈ రివార్డును మంజూరు చేశారు. ఇటీవలే లొంగిపోయిన బుర్ర భాగ్య అరుణకు కూడా రూ.5 లక్షల రివార్డును ప్రకటించారు.