ఇన్‌ఫార్మర్ నెపంతో వ్యక్తి హత్య | 1 killed by maoists | Sakshi
Sakshi News home page

ఇన్‌ఫార్మర్ నెపంతో వ్యక్తి హత్య

Published Thu, Jun 2 2016 7:58 PM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM

1 killed by maoists

వేమనపల్లి: తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాణహిత తీరం వెంట మావోయిస్టులు ఇన్‌ఫార్మర్ నెపంతో ఒకరిని కాల్చి చంపారు. జిల్లాను ఆనుకుని ఉన్న మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. ధనోరా తాలూకా మర్దమిలేంగా గ్రామానికి చెందిన శరత్ కురస్‌మిలా(38)ను మూడు రోజుల క్రితం మావోయిస్టులు అపహరించుకుపోయారు. అతడిని బుధవారం రాత్రి కాల్చి చంపారు. మృతదేహాన్ని మల్లపోదూర్ కుక్కమెట్టా గ్రామాల మధ్యనున్నరోడ్డుపై పడవేశారు. పోలీస్ ఇన్‌ఫ్మార్మర్‌గా వ్యవహరిస్తున్నందునే అతడిని హతమార్చినట్లు అక్కడ వదిలి వెళ్లిన లేఖలో పేర్కొన్నారు. వారం రోజుల అహెరి తాలూకా కాండ్లరాజారంలో ఆత్రం వెంకటేశ్ అనే గిరిజనుడిని కూడా ఇన్‌ఫార్మర్ నెపంతో కాల్చి చంపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement