మహిళల భద్రతపై కేసీఆర్ సమీక్ష
మహిళల భద్రతపై కేసీఆర్ సమీక్ష
Published Thu, Nov 6 2014 12:37 PM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM
హైదరాబాద్: మహిళల రక్షణ, భద్రతపై సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం సమీక్ష నిర్వహించారు. మహిళల రక్షణపై ఏర్పాటు చేసిన కమిటీ అందచేసిన నివేదికపై అధికారులతో కేసీఆర్ చర్చించారు.
ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, ఇతర శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. మహిళల రక్షణపై ప్రత్యేక దృష్టి, తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు కేసీఆర్ సూచించినట్టు తెలుస్తోంది.
Advertisement
Advertisement