
ఆ పనుల వేగం పెంచండి
ప్రభుత్వ ప్రధాన సలహాదారు డాక్టర్ రాజీవ్ శర్మ
సాక్షి, హైదరాబాద్: ఫార్మాసిటీ, టెక్స్‌టైల్ పార్కు నిర్మాణ పనులను వేగవంతం చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ప్రభుత్వ ప్రధాన సలహాదారు డాక్టర్ రాజీవ్ శర్మ ఆదేశించారు. ఫార్మాసిటీ, టెక్స్‌టైల్ పార్కు నిర్మాణాలపై గురువారం సచివాలయంలో రాజీవ్ శర్మ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
టెక్స్‌టైల్ పార్కుకు సంబంధించి రోడ్డు నిర్మాణంతో పాటు మాస్టర్ ప్లాన్, ఇంటర్‌నెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, నిధుల సమీకరణ, వివిధ కంపెనీలతో ఎంవోయూ, యాంకర్ యూనిట్, డీపీఆర్, సీఈటీపీ నిర్మాణం తదితర అంశాలను ప్రస్తావించారు. ఫార్మాసిటీకి సంబంధించి, రోడ్డు నిర్మాణ పనులు, భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.