కేంద్రాన్ని కోరిన తెలంగాణ సీఎస్
హైదరాబాద్: రాష్ట్ర విభజన చట్టంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఏ ప్రాంతంలో ఉన్న సంస్థలు ఆ ప్రాంతానికే చెందే విషయంలో స్పష్టత ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర సీఎస్ రాజీవ్‌శర్మ కేంద్రాన్ని కోరారు. సోమవారం ఢిల్లీలో విభజన చట్టంలోని అంశాల అమలుపై కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ సమన్వ య కార్యదర్శి నేతృత్వంలో తొలి సమావేశం జరిగింది.
పలు మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇందులో విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్‌లోని పలు అంశాలను సీఎస్ ప్రస్తావించారు. ఎన్టీపీసీ నిర్మించాల్సిన 4వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు, ఉద్యానవన, గిరిజన వర్సిటీల ఏర్పాటు అంశాలనూ లేవనెత్తారు. సంక్షోభం నుంచి బయటపడేందుకు తెలంగాణకు విద్యుత్ సరఫరా చేయాలని కోరినట్లు సమాచారం.
పదో షెడ్యూల్‌పై స్పష్టత ఇవ్వండి
Published Tue, Oct 21 2014 2:52 AM | Last Updated on Sat, Sep 2 2017 3:10 PM
Advertisement