
బలవంతంగానైనా పంపించండి: శర్మ
విభజన పురోగతి, శాఖల ఏర్పాట్లపై తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రాజీవ్‌శర్మ సమీక్షా సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్: విభజన పురోగతి, శాఖల ఏర్పాట్లపై తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రాజీవ్‌శర్మ సమీక్షా సమావేశం నిర్వహించారు. అనుకున్నంత వేగంగా తెలంగాణలో శాఖల విస్తారణ ఏర్పాటు చేయడం లేదని రాజీవ్‌శర్మ అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే సోమవారాని కల్లా తెలంగాణ సచివాలయంలో కొనసాగుతున్న ఇతర శాఖలను బలవంతంగానైనా పంపించాలని ఆదేశించారు.
తెలంగాణ సచివాలయంతో సహా కమిషనరేట్లు, డైరెక్టరేట్లలో కనీసం బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంలోగా ఇవన్నీ ఏర్పాటు చేయాలని రాజీవ్‌శర్మ ఆదేశించారు.