'సాఫీగా మెట్రోరైలు ప్రాజెక్టు పనులు' | no jolt for hyderabad metro train works, says nvs reddy | Sakshi
Sakshi News home page

'సాఫీగా మెట్రోరైలు ప్రాజెక్టు పనులు'

Published Thu, Sep 18 2014 2:06 PM | Last Updated on Tue, Sep 4 2018 3:39 PM

'సాఫీగా మెట్రోరైలు ప్రాజెక్టు పనులు' - Sakshi

'సాఫీగా మెట్రోరైలు ప్రాజెక్టు పనులు'

హైదరాబాద్: మెట్రో రైలు ప్రాజెక్టు పనులు సజావుగా కొనసాగుతున్నాయని హైదరాబాద్ మెట్రో రైలు మేనేజింగ్ డెరైక్టర్ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో పనులపై ఈ రోజు పూర్తిస్థాయిలో పర్యవేక్షణ జరిపామని ఆయన చెప్పారు. బేగంపేట నుంచి చిలకలగూడవరకు పనులను పరిశీలించమన్నారు. అలైన్‌మెంట్ మార్పుపై ఓ నిర్ణయం తీసుకున్న తర్వాత ఎల్ అండ్ టీ సంస్థకు తెలియజేస్తామని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్వర్మతో ఆయన గురువారం సమావేశమయ్యారు. మెట్రో రైలు ప్రాజెక్టు పనుల్లో పురోగతిని ప్రధాన కార్యదర్శికి వివరించారు. మెట్రో ప్రాజెక్టు పనులు సాఫీగా ముందుకుసాగుతాయని, పనులు ఎక్కడా ఆగలేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement