
ప్రధాని సభ ఏర్పాట్ల పరిశీలన
మెదక్: మెదక్ జిల్లా గజ్వేల్‌లో ఆగస్టు 7వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని సభ ఏర్పాట్లను ఉన్నతాధికారులు మంగళవారం పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ గజ్వేల్ విచ్చేశారు. జిల్లా కలెక్టర్తోపాటు పోలీసు ఉన్నతాధికారులను వారు ఏర్పాట్లపై చర్చించారు. ఈ చర్చల్లో భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు కూడా పాల్గొన్నారు.