నల్లగొండ జిల్లాలో సీఎస్ రాజీవ్‌శర్మ పర్యటన
Published Sat, Sep 17 2016 2:13 PM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM
భువనగిరి: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ శనివారం నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న యాదాద్రి జిల్లాకు సంబంధించిన కలక్టరేట్, ఎస్పీ కార్యాలయాల కోసం భువనగిరిలో భవనాలను పరిశీలించారు. హైదరాబాద్ రోడ్డు సమీపంలోని పగిడిపల్లి వద్ద ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్‌ను కలక్టరేట్ భవనంగా, జగదేవ్‌పూర్ రోడ్డులో ఉన్న పాత బీఈడీ కళాశాలను ఎస్పీ కార్యాలయంగా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పాటు కాబోయే జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల విషయంలో ఎలాంటి రాజకీయాలకు తావులేదని.. ప్రజల అభిప్రాయం మేరకే ఏర్పాటు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. అనంతరం సీఎస్ సూర్యాపేటకు బయల్దేరారు. అక్కడ కూడా నూతన జిల్లా కార్యాలయాలను సీఎస్ పరిశీలించనున్నారు.
Advertisement
Advertisement