రేపటి నుంచి డీకే అరుణ నిరాహార దీక్ష
హైదారాబాద్: తెలంగాణలో ప్రత్యేక జిల్లాల ఆందోళనలు రోజురోజుకి ఎక్కువవుతున్నాయి. తాజాగా గద్వాల జిల్లా కోరుతూ మాజీ మంత్రి డీకే అరుణ రెండు రోజుల నిరాహార దీక్ష చేయనున్నారు. శనివారం, ఆదివారం ఇందిరాపార్క్ వద్ద దీక్షకు దిగనున్నట్టు ప్రకటించారు. కాగా కొత్త జిల్లాల ముసాయిదా అశాస్ర్తియంగా ఉందని మాజీ మంత్రి డీకే అరుణ విమర్శించారు. ఇష్టానుసారంగా జిల్లాల విభజన చేస్తున్నారని మండిపడ్డారు. గద్వాల, జనగామలను జిల్లాలుగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.