
సాక్షి,చాంద్రాయణగుట్ట( హైదరాబాద్): ఇంటి నుంచి బయటికి వెళ్లిన ఓ గృహిణి అదృశ్యమైన సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చాంద్రాయణగుట్ట దస్తగిరి ప్రాంతానికి చెందిన మహ్మద్ ఆదిల్, నజ్మీన్ అన్సారీ (34) దంపతులు. కాగా ఆదిల్ నజ్మీన్‌ను రెండో వివాహం చేసుకోవడంతో మొదటి భార్య వదిలేసింది.
ఆదిల్, నజ్మీన్ మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రతి రోజూ ఇంట్లో గొడవలు జరిగేవి. ఈ నెల 23వ తేదీ 8.30 గంటలకు నజ్మీన్ భర్త ఆదిల్ ఇంట్లో ఉండగా... ఇంటికి తాళం వేసి బయటి వెళ్లింది. అనంతరం తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆందోళన చెందిన భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: Bullettu Bandi Bride: ‘బుల్లెట్టు బండి’ వధువుకు బంపర్ ఆఫర్