సరైన వైద్యం అందక బాలింత మృతి
సరైన వైద్యం అందక బాలింత మృతి
Published Thu, Dec 8 2016 12:01 AM | Last Updated on Sat, Oct 20 2018 5:53 PM
బంధువులు ఆందోళన ∙
రూ.2 లక్షల పరిహారానికి ఆస్పత్రి వర్గాల హామీ
అంబాజీపేట : అంబాజీపేట స్త్రీల ఆస్పత్రిలో ౖÐð ద్యాధికారి నిర్లక్ష్యం వల్లే బాలింత మృతి చెందిందని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేశారు. బుధవారం జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అయినవిల్లి మండలం తొత్తరమూడికి చెందిన తొత్తరమూడి మధుబాబుతో అంబాజీపేట హడ్కోకాలనీకి చెందిన వసంతకుమారి వివాహం అయ్యింది. వసంత కుమారి ప్రసవం నిమిత్తం గత నెల 30న స్థానిక స్త్రీల ఆస్పత్రిలో చేరింది. 1వ తేదీన శస్త్రచికిత్స చేయగా ఆమెకు పాపపుట్టింది. తదనంతర చికిత్స పొందుతుండగా బాలింతకు కిడ్నీ సమస్య, హైబీపీ రావడంతో మెరుగైన చికిత్స కోసం కాకినాడకు తీసుకువెళ్ళాలని వైద్యా ధికారి డాక్టర్ పుష్ప సూచించారు. దీంతో వసంతకుమారి బంధువులు ఆమెను కాకినాడ తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆమె బుధవారం ఉదయం మృతి చెందింది. వైద్యం సరిగా అందకే వసంతకుమారి చనిపోయిందని ఆమె బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాలు చర్చించడంతో బాధిత కుటుంబానికి రూ.2 లక్షల నష్టపరిహరం చెల్లించేందుకు ఆస్పత్రి వర్గాలు అంగీకరించాయి. దీంతో పరిస్థితి సద్దు మణిగింది. ఇదిలా ఉండగా డాక్టర్ పుష్ప ప్రభుత్వ వైద్యాధికారిగా పనిచేస్తూ దీర్ఘ కాలిక సెలవు పెట్టి ఇక్కడ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం తెలుసుకున్న అల్లవరం, అమలాపురం తాలుక ఎస్సైలు డి.ప్రశాంతకుమార్, ఎం.గజేంద్రకుమార్ జరిగిన సంఘటనపై ఇరువర్గాలను విచారించారు. ఈ చర్చల్లో ఎంపీటీసీ ఉండ్రాజవరపు ప్రకాశరావు, నాగాబత్తుల సుబ్బారావు, ఉందుర్తి నాగబాబు పాల్గొన్నారు.
Advertisement
Advertisement