
సాక్షి,కాశీబుగ్గ(శ్రీకాకుళం): అంతగా జన సంచారం లేని కొబ్బరి తోట, కొద్ది దూరంలో రైల్వే ట్రాక్.. రైలు కూతలు తప్ప ఇంకేమీ వినిపించని ఆ ప్రదేశంలో ఓ యువతి శరీరం నిండా గాయాలతో కనిపించడం శుక్రవారం వజ్రపుకొత్తూరు మండలంలో కలకలం రేపింది. గరుడబద్ర పంచాయతీ పరిధి మర్రిపాడు వద్ద రైల్వే ట్రాక్ పరిసరాల్లో గల కొబ్బరి తోట వద్ద శుక్రవారం అపస్మారక స్థితిలో ఉన్న ఓ యువతిని స్థానికులు గుర్తించారు. ఆమె ఒరియా లో మాట్లాతుండడం, నీరసంగా ఉన్న ఆమె మా టలు ఎవరికీ అర్థం కాకపోవడం, శరీరంపై గా యాలు కనిపిస్తూ ఉండడంతో ఏం జరిగిందో ఎవరికీ తెలియలేదు.
యువతిని చూసిన వారు పోలీసులకు, 108కు సమాచారం అందించారు. స్థానిక ఎస్‌ఐ కూన గోవిందరావు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. 108 సిబ్బంది ఆమెకు ప్రథమ చికిత్స చేసి పలాస సా మాజిక ఆస్పత్రికి తరలించారు. యువతిని ఒడి శా ప్రాంతానికి చెందిన మహిళగా గుర్తించామని, ట్రైన్ నుంచి ప్రమాదవశాత్తు జారి పడినట్లు భా విస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. ఆమె మాటలు మతిస్థిమితం లేనట్టుగా ఉన్నాయని, కోలుకున్నా క పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment