ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య
Published Wed, Sep 7 2016 9:56 PM | Last Updated on Mon, Sep 4 2017 12:33 PM
జ్యోతినగర్ : రామగుండంలోని అన్నపూర్ణకాలనీకి చెందిన దీటి శ్రీవాణి(25) బుధవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రామగుండం మండలం ఆకెనపల్లి గ్రామానికి చెందిన శ్రీవాణిని కార్పొరేషన్ పరిధిలోని మూడో డివిజన్‌కు చెందిన దీటి వెంకటేష్‌కిచ్చి పెళ్లి చేశారు. వీరికి కుమారుడు, కూతురు సంతానం. ఏమైందో తెలియదుగానీ.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోనే ఉరేసుకుంది. భర్త వెంకటేష్ ఇంటికొచ్చి చుట్టుపక్కలవారి సహాయంతో కిందకు దింపి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందింది. మృతురాలు తండ్రి లగిశెట్టి చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై సాబీరొద్దిన్ తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement