చాంద్రాయణగుట్ట, న్యూస్‌లైన్: అతివపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి.. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ యువకుడు బాలికను కిడ్నాప్ చేసి నాలుగు రోజుల పాటు లైంగికదాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నిందితుడ్ని శాలిబండ పోలీసులు అరెస్టు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. శాలిబండ కాజీపురా ప్రాంతానికి చెందిన సులేమాన్ బిన్ హసన్ మిశ్రీ (28) స్థానికంగా ఉండే బాలిక (16)పై కన్నేశాడు. ఈ నెల 15న ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెను కిడ్నాప్ చేసి నాంపల్లిలోని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. అప్పటి నుంచి ఆమెపై మూడ్రోజుల పాటు లైంగికదాడికి ఒడిగట్టాడు. ఈ నెల 18న బాలికను ఫలక్‌నుమాలో ఉండే తన సోదరుడి ఇంటికి తీసుకువచ్చాడు. మరోవైపు, తమ కుమార్తె కనిపించడం లేదని బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. 19న సాయంత్రం మిశ్రీ బాలికను మరో ప్రాంతానికి తీసుకెళ్తున్నాడని విశ్వసనీయ సమాచారం అందడంతో దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిందితుడు జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్లు వివరించాడు. అతనిపై కిడ్నాప్, లైంగికదాడి కేసులతో పాటు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం రిమాండ్‌కు తరలించారు.
తాత్కాలిక కార్మికులను
క్రమబద్ధీకరించాలి: హరీష్‌రావు
సాక్షి, సిటీబ్యూరో: జలమండలిలో ఎన్‌ఎంఆర్, హెచ్.ఆర్ తాత్కాలిక కార్మికులుగా పని చేస్తున్న 470 మంది విధులను క్రమబద్ధీకరించాలని గుర్తింపు కార్మిక సంఘం కామ్‌గార్ యూని యన్ గౌరవ అధ్యక్షుడు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు జలమండలి ఎండీ శ్యామలరావును కోరారు. ఈ మేరకు మంగళవారం బోర్డు కార్యాలయంలో ఆయనను కలిసి వినతిపత్రం సమర్పించారు. దీపావళి పర్వదినానికి ముందే కార్మికుల విధులను క్రమబద్ధీకరించాలని, ఉద్యోగులకు పండగ కానుకగా మంచి బహుమతులు అందజేయాలని కోరారు.
బాలిక కిడ్నాప్.. లైంగికదాడి
Published Wed, Oct 23 2013 2:42 AM | Last Updated on Fri, Sep 1 2017 11:52 PM
Advertisement