kidnapp
-
ప్లస్‌వన్ విద్యార్థిని కిడ్నాప్
తిరువొత్తియూరు: ప్లస్‌వన్ విద్యార్థినిని కిడ్నాప్ చేసిన కేసులో కళాశాల విద్యార్థితో సహా నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కృష్ణగిరి జిల్లా కావేరి పట్టణం సమీపంలో జైనూరుకు చెందిన బాలిక అదే ప్రాంతంలో ఉన్న పాఠశాలలో ప్లస్‌వన్ చదువుతోంది. ఈనెల 26వ తేదీ ఇంటిలో ఉన్న విద్యార్థిని హఠాత్తుగా అదృశ్యమైంది. ఈ విషయంపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో కావేరి పట్టణ సమీపంలో ఉన్న నెడుగళ్ గ్రామానికి చెందిన ప్రైవేటు కళాశాలలో మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థి సూర్య (26) తన కుమార్తెను వివాహం చేసుకుంటానని మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసినట్లు తెలిపారు. ఈ వ్యవహారానికి సాలే గూలీ సెలసనాం పట్టి జగన్నాథన్ (35), ముత్తులక్ష్మి (27), పళణియమ్మాళ్ (46) తదితరులు సహకరించినట్లు తెలిపారు. దీంతో కృష్ణగిరి మహిళా పోలీసు ఇన్స్పెక్టర్ మహాలక్ష్మి కేసు నమోదు చేసి అదృశ్యమైన బాలికను మంగళవారం విడిపించారు. కళాశాల విద్యార్థితో సహా నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లి ఇష్టంలేక ఫేస్బుక్ ఫ్రెండ్‌తో.. కిడ్నాప్..
సాక్షి, ప్రకాశం : జిల్లాలో కిడ్నాప్ కలకలం రేగింది. ఓ హోటల్ రూములో దిగిన నలుగురు యువకులు, యువతిపై దాడి చేసిన కొందరు యువతితో పాటు ఓ యువకుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. అయితే కొద్ది సేపట్లోనే పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ సంఘటన ఒంగోలులో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన సంగీత అనే యువతికి ఏడాదిన్నర క్రితం మేనమామతో వివాహమైంది. అయితే మేనమామతో వివాహం ఇష్టం లేక ఆమె ఇంటి నుండి పరారైంది. ఫేస్ బుక్‌లో పరిచయమైన చిత్తూరుకు చెందిన మనోజ్ దగ్గరకు చేరుకుంది. ఈ నేపథ్యంలో సంగీత, మనోజ్‌లు ఒంగోలులో ఉన్నారని తెలుసుకున్న ఆమె బంధువులు వారు ఉంటున్న హోటల్ రూం దగ్గరకు చేరుకున్నారు. మధ్యాహ్నం సమయంలో రూములోకి ప్రవేశించి లోపల ఉన్న మనోజ్, సంగీతలతో పాటు మరో ముగ్గరు యువకులను చితకబాదారు. సంగీత ఆదార్ జిరాక్స్, హోటల్ రిజిస్ట్రేషన్ కార్డు ఆ దాడితో ముగ్గురు యువకులు అక్కడి నుండి పరారయ్యారు. ఆమె బంధువులు మనోజ్ పాటు సంగీతని బలవంతంగా ఓ కారులో ఎక్కించారు. అదే సమయంలో హోటల్ బయట ఉన్న యువకుడు మనోజ్‌కి చెందిన ఇన్నోవా కారుపై దాడి చేశాడు. కారు అద్దాలను ధ్వంసం చేశాడు. అనంతరం వారు అక్కడినుంచి ఆగమేఘాల మీద పరారయ్యారు. ఏం జరుగుతుందో తెలియక హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మద్దిపాడు వద్ద యువతీ, యువకుడిని తీసుకెళ్తున్న కారుని పట్టుకున్నారు. అందరినీ ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. -
సిగరేట్ రేపర్‌పై చీటీ రాసి.. ముఠా చెర నుంచి..
సాక్షి, తాడేపల్లిగూడెం రూరల్ : గుర్తు తెలియని వ్యక్తులు 70 రోజులుగా తనను భవనంలో బందీగా ఉంచారని.. ఇక్కడి నుంచి విముక్తుడిని చేయాలని ఓ వృద్ధుడు సిగరెట్ పాకెట్ రేపర్‌పై రాసి ఆటో డ్రైవర్‌కు అందించిన లేఖ తాడేపల్లిగూడెంలో కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ శివారులోని ఒక భవనాన్ని గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ఆగస్టులో అద్దెకు తీసుకున్నారు. భవనం మొదటి అంతస్తులో ఒక వృద్ధుడిని బంధించి కాపలా ఏర్పాటు చేశారు. జనసంచారం లేని సమయంలో భవనంలో తవ్వకాలు చేపడుతున్నారు. స్పీకర్ కోడెల తాలూకా అంటూ.. భవనంలో ఉంటున్న వారిపై స్థానికులకు అనుమానం వచ్చి ప్రశ్నించగా డొంక తిరుగుడు సమాధానాలు చెప్పారు. తాము పోలవరం ప్రాజెక్టు వర్కర్లమని.. పంగిడి, ఆరుగొలనులోని క్వారీల్లో కాంట్రాక్ట్‌లు చేస్తుంటామని.. అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తాలూకా అంటూ సమాధానాలు చెప్పారు. తీరా వారిని గుర్తింపు కార్డులు ఇవ్వాలంటూ స్థానికులు నిలదీయడంతో తీసుకొస్తామంటూ వారు అక్కడ నుంచి ఉడాయించారు. వీరు మొత్తం 12 నుంచి 15 మంది వరకు ఉన్నారు. వారు వేసుకువచ్చిన స్విఫ్ట్ డిజైర్‌కు కర్ణాటక రిజిస్ట్రేషన్ నంబరు ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. వృద్ధుడి సందేశంతో బయల్పడిన ఉదంతం భవనంలో బందీగా ఉన్న వృద్ధుడు శుక్రవారం ఉదయం సిగరెట్ పెట్టెలోని రేపర్‌పై ‘సార్, మాది నరసరావుపేట. నా పేరు వెంకటేశ్వర్లు. ఈ ఇంట్లో ఉండే వాళ్లు నన్ను 70 రోజుల క్రితం కిడ్నాప్ చేశారు. మీ కాళ్లు పట్టుకుంటాను. దయచేసి ఈ విషయం జిల్లా ఎస్పీకి చెప్పి నా ప్రాణాలు కాపాడండి. ఈ విషయం బయట చెప్పొద్దు. వీరికి తెలిస్తే నన్ను చంపుతారు ప్లీజ్’అని రాసి, రిమోట్ బ్యాటరీకి ఆ కాగితాన్ని చుట్టి రోడ్డుపై వెళ్తున్న ఆటోడ్రైవర్ పైకి విసిరాడు. దీంతో ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావుకు తెలియడంతో ఆయన సూచనతో శుక్రవారం రాత్రి 11 గంటలకు పోలీసులు ఆ భవనం వద్దకు చేరుకున్నారు. అనంతరం అక్కడ బందీగా ఉన్న వృద్ధునితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఎటువంటి ఫిర్యాదు అందలేదు హౌసింగ్ బోర్డు శివారులోని భవంతిలో చోటుచేసుకున్న పరిణామాలపై మాకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు. ఈ విషయమై దర్యాప్తు చేస్తున్నాం. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాం. –ఎంఆర్‌ఎల్‌ఎస్‌ఎస్ మూర్తి, తాడేపల్లిగూడెం పట్టణ సీఐ -
దొంగలను కిడ్నాప్ చేసిన మావోలు?
ఖమ్మం జిల్లా చర్ల మండలం చినమిడిసిలేరు గ్రామానికి చెందిన కలప దొంగలను మావోయిస్టులు బుధవారం రాత్రి కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు రోజు మాదిరిగానే సమీప అటవీ ప్రాంతానికి వెళ్లి సరిహద్దు ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతం నుంచి టేకు కలపను నరికి.. దుంగలుగా చెక్కి తీసుకొచ్చి ఇక్కడి నుంచి మణుగూరు, బయ్యారం ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి టేకు దిమ్మెలను తెచ్చేందుకు వెళ్లిన ఐదుగురు యువకులను సరిహద్దు ప్రాంతంలోని ఓ గ్రామ సమీపంలో మావోయిస్టు మిలీషియా సభ్యులుగా అనుమానిస్తున్న వ్యక్తులు.. వారిని అదుపులోకి తీసుకొని మావోయిస్టుల వద్దకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే గతంలో పలుమార్లు కలప స్మగ్లర్లను మావోయిస్టులు హెచ్చరించినట్లు తెలుస్తుండగా.. వారి మాటను పెడచెవిన పెడుతుండటంతోనే వీరిని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. అయితే కిడ్నాప్‌నకు గురైనట్లుగా భావిస్తున్న యువకుల కుటుంబ సభ్యులుగానీ, గ్రామస్తులుగానీ నోరుమెదపడం లేదు. దీనిపై వెంకటాపురం సీఐ సాయిరమణను సాక్షి’ వివరణ కోరగా.. ఈ విషయం తమ దృష్టికి రాలేదన్నారు. -
అస్త్ర తంత్ర : మన భద్రత ఎవరి బాధ్యత?
ఆడపిల్లలకు పీడకలల్నే ఎక్కువ మిగిల్చిన సంవత్సరం 2013. కిడ్నాపులు, మానభంగాలు, హత్యలతో సంవత్సరమంతా చేదునే రుచి చూపించింది. ఓ నిర్భయ కథ భయంతో వణికిస్తే... ఓ గుడియా వ్యథ గుండెల్ని మెలిపెట్టింది. ఇంకా ఎన్నో అక్రమాలు... ఎందరివో ఆక్రందనలు. ఆడపిల్లగా పుట్టడం నేరమా, ఆడపిల్ల ఈ దేశంలో బతకడం అంత కష్టమా అన్న ప్రశ్నలతో దిక్కులు పిక్కటిల్లాయే కానీ... ఈ క్షణం వరకూ వాటికి సమాధానం మాత్రం దొరకలేదు. కనీసం ఆ సమాధానం వచ్చే సంవత్సరమైనా దొరకుతుందని ఆశించవచ్చా? ఏమో... చెప్పలేం. అయినా ఎవరినో ప్రశ్నించి సమాధానం కోసం ఎదురు చూడటం ఎందుకు? మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మన రక్షణ కోసం మనమేం చేస్తున్నాం అని ప్రశ్నించుకుందాం. మనకోసం మనమేం చేయాలో ఆలోచించుకుందాం. మన భద్రత ఎవరి బాధ్యతా కాదు. మన బాధ్యతే. అందుకే... మన కోసం మనం కొన్ని చేసుకుందాం. స్నేహాలు మంచివే. కానీ మగ స్నేహాల విషయంలో జాగ్రత్త తప్పదు. అందరూ చెడ్డవాళ్లే ఉంటారని కాదు. మనం మంచివాళ్లనుకునే వారిలో మేకవన్నె పులులు ఉండరని అనుకోలేం. మొన్నటికి మొన్న ఉత్తరాదికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించినవాడే కిడ్నాప్ చేసి రేప్ చేశాడు. వైజాగ్‌కు చెందిన ఓ అమ్మాయిని స్నేహితుడే పార్టీకి పిలిచి అత్యాచారం చేశాడు. అందుకే... స్నేహం చేసేటప్పుడు కాస్త ఆ మనిషి గురించి తెలుసుకోవడం ఉత్తమం. స్నేహంలో కూడా కొన్ని పరిమితులు పాటించడం క్షేమం. సోషల్ నెట్వర్కింగ్ సైట్ల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉందాం. మన వ్యక్తిగత వివరాలను వాటిలో పెట్టడం, ఫొటోలు అప్లోడ్ చేయడం, ఫోన్‌నంబర్లు వంటివి షేర్ చేయడం మానేద్దాం. చెడు ఆలోచనలు మనకు లేకపోవచ్చు. వేరేవారికి రావని చెప్పలేం కదా! ఒంటరితనానికి చెక్ పెడదాం. అంటే... రాత్రిళ్లు ఒంటరిగా ప్రయాణాలు చేయడం, ఒంటరిగా పార్టీలకు వెళ్లడం, ఒంటరిగా షాపింగులు చేయడం... ఏదీ ఒంటరిగా వద్దు. తోడు ఎవరూ లేరనుకుంటే పగలు చేసుకోవాలి తప్ప... రాత్రిపూట రోడ్డుమీదికి వెళ్లడం, రిస్క్‌ను కొని తెచ్చుకోవడమే! లౌక్యం నేర్చుకుందాం. అర్జంటుగా ఫోన్ చేసుకోవాలి, ఓసారి ఫోన్ ఇవ్వండి అంటారు. ఇచ్చేస్తాం. మన నంబర్ సేవ్ చేసుకుని వేధిస్తారు. ఎవరో కొత్తవాళ్లు ఏదో పనుండి వచ్చినట్టు వస్తారు. ఇంట్లోకి పిలిచి మరీ మాట్లాడతాం. ఆ తర్వాత లేనిపోని కష్టాలు మొదలు. సాయం చేయవద్దని కాదు. ప్రమాదాన్ని ముందే ఊహించి మరీ సాయం చేయడం మంచిది! మనవంతుగా మనం ఇలాంటి జాగ్రత్తలు తీసుకుందాం. కనీసం ఈ కొత్త సంవత్సరం అయినా మన కష్టాలు తీరతాయేమో చూద్దాం. మనం కోరుకుంటోన్న భద్రత మనకు దొరుకుతుందని ఆశిద్దాం! -
అస్త్ర తంత్ర : ధైర్యంతో పాటు మీ దగ్గర ఇవీ ఉండాలి
కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన ఓ సంఘటన మహిళలందరినీ వణికించింది. సాయంత్రం విధులు ముగించుకుని, ఇంటికెళ్లేందుకు ఆటో ఎక్కిన ఓ ఉద్యోగినిని... ఆటో డ్రైవర్ తన స్నేహితులతో కలిసి కిడ్నాప్ చేయాలని ట్రై చేశాడు. వారి నుంచి తప్పించుకునేందుకు సకల ప్రయత్నాలూ చేసిన ఆ అమ్మాయి, చివరకు తన దగ్గరున్న డియోడరెంట్ను వారి కళ్లలో స్ప్రే చేసి, ఆటోలోంచి దూకి తప్పించుకుంది. ఒకవేళ ఆ సమయంలో ఆ అమ్మాయికి అలా చేయాలన్న ఆలోచన రాకపోతే? అసలు ఆమె దగ్గర ఆ డియో స్ప్రేనే ఉండకపోతే? తలచుకుంటేనే భయమేస్తోంది కదూ! కిడ్నాపులు, అత్యాచారాలు పెచ్చుమీరుతుండటంతో ఆడ వాళ్లు అర్ధరాత్రే కాదు, పట్టపగలు కూడా ధైర్యంగా తిరగలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా విద్యార్థినులు, ఉద్యోగినులు ఉదయం బైట అడుగు పెట్టినప్పట్నుంచి, సాయంత్రం ఇంటికి చేరేవరకూ బిక్కుబిక్కుమంటూనే ఉంటున్నారు. ఏవైపు నుంచి ప్రమాదం ముంచుకు వస్తుందో తెలియక భీతిల్లుతున్నారు. అందుకే మహిళల సంరక్షణ కోసం కొన్ని ‘ఆయుధాలు’ తయారయ్యాయి. వాటి గురించి తెలుసుకోవడం, వాటిని సదా దగ్గరుంచుకోవడం ప్రతి మహిళకీ అత్యవసరం. పెప్పర్ స్ప్రే: మిరియాల పొడిని కళ్లలో చల్లితే ఎలా ఉంటుంది? భగ్గుమంటుంది. కాసేపు ప్రపంచమంతా మసకబారిపోతుంది. పెప్పర్ స్ప్రేలను తయారుచేసిన ఉద్దేశం అదే. దీన్ని కళ్లలో చల్లితే అవతలి వ్యక్తికి కాసేపు ఏమీ కనిపించదు. అతడు తేరుకునేలోపు మీరు తప్పించుకోవచ్చు. చిన్నగా, చేతిలో పట్టుకునేందుకు వీలుగా ఉంటాయివి. కీచెయిన్స్ రూపంలో ఉన్నవయితే మరీ సౌకర్యంగా ఉంటాయి. అది స్ప్రే అని ఎవరూ కనిపెట్టరు. వెల: రూ. 400 నుంచి మొదలు చిల్లీ పెప్పర్ స్ప్రే: మిరియాల పొడికి గొడ్డుకారాన్ని కలిపిన ఎఫెక్టు ఉంటుంది దీనితో. ఒక్కదాన్ని చల్లితేనే కళ్లు కనిపించకపోతే, ఈ రెండిటినీ కలిపి కొడితే పరిస్థితి ఎలా ఉంటుంది! దీనివల్ల సదరు వ్యక్తి మరికాస్త ఎక్కువ ఇబ్బంది పడతాడు. మీరు మరింత ఎక్కువ దూరం వెళ్లిపోయే చాన్స్ ఉంటుంది. వెల: రూ. 300 నుంచి మొదలు కాప్ అలెర్ట్ అలారం: కంప్యూటర్ మౌస్ కంటే చిన్నగా ఉంటుందీ అలారం. ఒంటరిగా వెళ్తున్నప్పుడు దీన్ని చేత్తోపట్టుకుని ఉండటం మంచిది. ఏమాత్రం ప్రమాద సూచికలు కనిపించినా, వెంటనే దాన్ని నొక్కాలి. అది ఎంత శబ్దం చేస్తుందంటే... కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నవారికి కూడా స్పష్టంగా వినిపిస్తుంది. దాంతో ఎవరో ఒకరు సహాయానికి వచ్చే అవకాశం ఉంటుంది. వెల: రూ. 450. మోడల్‌ను బట్టి రేటు పెరుగుతుంది. ఫోల్డింగ్ స్టిక్: చూడ్డానికి చాలా చిన్నదిగా ఉంటుంది. కానీ ఒక్కసారి విదిలించగానే బారెడు పొడవవుతుంది. దీనితో ఒక్క పోటు పొడిచారంటే, అవతలివారు అదిరిపోవడం ఖాయం. ఎందుకంటే ఇది చాలా బలంగా తాకడమే కాదు, సన్నని ఎలక్ట్రిక్ షాక్ కూడా ఇస్తుంది. ముఖ్యంగా చేతి మీదో కాలి మీదో దీనితో కొడితే, ఆ అవయవం కాసేపు మొద్దుబారి కదలనని మొరాయిస్తుంది. ఈలోపు మనం ఎస్కేప్ కావచ్చు. వెల: దాదాపు 2,000/- పెప్పర్ గన్స్: ఇది కూడా పెప్పర్ స్ప్రే లాంటిదే. కాకపోతే గన్ మోడల్ చేతిలో చక్కగా ఇముడుతుంది కాబట్టి స్ప్రే కంటే కాస్త ఈజీగా ఉంటుంది ఆపరేట్ చేయడం. పైగా అనుమానం రాగానే కాస్త దూరం నుంచే సూటిగా అవతలి వారి కంట్లోకి గురిచూసి వదలొచ్చు. వెల: రూ. 500 నుంచి మొదలు ఎలక్ట్రిక్ షాక్ ఫ్లాష్ లైట్: ఓ వ్యక్తి సడెన్‌గా అటాక్ చేయడానికి ట్రై చేశాడనుకోండి... వెంటనే చేతిలోని ఫ్లాష్లైటును నొక్కితే సరి. అందులోంచి వెలువడిన కాంతిపుంజం అతడి ఒంటిమీద పడగానే, అతడికి తీవ్రమైన ఎలక్ట్రిక్ షాక్ తగులుతుంది. అంతే, అతడు కాసేపు కదల్లేని పరిస్థితి ఏర్పడుతుంది. అయితే తీసుకెళ్లేముందు పూర్తిగా చార్జింగ్ పెట్టడం మర్చిపోకూడదు. వెల: రూ. 5 నుంచి 7 వేల మధ్యలో ఉంది. పెన్ డిఫెండర్: చూడ్డానికి పెన్నులాగే ఉంటుంది. చక్కగా జేబుకో లేక షర్టుకో పెట్టుకుని వెళ్లిపోవచ్చు. ప్రమాదాన్ని పసిగట్టగానే దానికున్న క్యాప్ తీసి అవతలివారి కళ్లలోకి స్ప్రే చేస్తే చాలు, ఇక మీరెక్కడున్నారో కూడా అతడు చూడలేడు. వెల: రూ. 5000 నుంచి మొదలు. మోడల్‌ను బట్టి రేటులో మార్పు ఉంటుంది. స్విస్ నైఫ్: యుద్ధ సమయాల్లో ఖైదీలకు ఉపయోగపడేందుకు, ఒకవేళ ఎక్కడైనా చిక్కుకుపోతే వాళ్లకు పలురకాలుగా ఉపయోగపడేందుకు తయారు చేసిన ఆయుధం ఇది. బాటిల్ ఓపెనర్, స్క్రూ డ్రైవర్, కత్తెర, రెంచ్, రెండు మూడు రకాల చాకులు కలిపితే స్విస్ నైఫ్. వీటన్నిటితో ఒక్కసారి దాడిచేస్తే ఎవరైనా చిత్తయిపోవాల్సిందే. వెల: రూ. 1000 నుంచి మొదలు ఇవన్నీ డిపార్ట్మెంటల్ స్టోర్లలో లభిస్తున్నాయి. ఆన్లైన్లో కూడా కొనుగోలు చేసుకోవచ్చు. పలు ఇ-కామర్స్ వెబ్సైట్లు డిస్కౌంట్ కూడా ఇస్తున్నాయి. ఒకవేళ వెల ఎక్కువైనా గానీ వీటిని కొనడానికి వెనుకాడకపోవడం మంచిది. ఎందుకంటే... వాటికోసం ఖర్చు చేస్తే, అవి ఎన్నోసార్లు మనల్ని కాపాడుతాయి. -
బాలిక కిడ్నాప్.. లైంగికదాడి
చాంద్రాయణగుట్ట, న్యూస్‌లైన్: అతివపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి.. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ యువకుడు బాలికను కిడ్నాప్ చేసి నాలుగు రోజుల పాటు లైంగికదాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నిందితుడ్ని శాలిబండ పోలీసులు అరెస్టు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. శాలిబండ కాజీపురా ప్రాంతానికి చెందిన సులేమాన్ బిన్ హసన్ మిశ్రీ (28) స్థానికంగా ఉండే బాలిక (16)పై కన్నేశాడు. ఈ నెల 15న ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెను కిడ్నాప్ చేసి నాంపల్లిలోని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. అప్పటి నుంచి ఆమెపై మూడ్రోజుల పాటు లైంగికదాడికి ఒడిగట్టాడు. ఈ నెల 18న బాలికను ఫలక్‌నుమాలో ఉండే తన సోదరుడి ఇంటికి తీసుకువచ్చాడు. మరోవైపు, తమ కుమార్తె కనిపించడం లేదని బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. 19న సాయంత్రం మిశ్రీ బాలికను మరో ప్రాంతానికి తీసుకెళ్తున్నాడని విశ్వసనీయ సమాచారం అందడంతో దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిందితుడు జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్లు వివరించాడు. అతనిపై కిడ్నాప్, లైంగికదాడి కేసులతో పాటు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం రిమాండ్‌కు తరలించారు. తాత్కాలిక కార్మికులను క్రమబద్ధీకరించాలి: హరీష్‌రావు సాక్షి, సిటీబ్యూరో: జలమండలిలో ఎన్ఎంఆర్, హెచ్.ఆర్ తాత్కాలిక కార్మికులుగా పని చేస్తున్న 470 మంది విధులను క్రమబద్ధీకరించాలని గుర్తింపు కార్మిక సంఘం కామ్‌గార్ యూని యన్ గౌరవ అధ్యక్షుడు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు జలమండలి ఎండీ శ్యామలరావును కోరారు. ఈ మేరకు మంగళవారం బోర్డు కార్యాలయంలో ఆయనను కలిసి వినతిపత్రం సమర్పించారు. దీపావళి పర్వదినానికి ముందే కార్మికుల విధులను క్రమబద్ధీకరించాలని, ఉద్యోగులకు పండగ కానుకగా మంచి బహుమతులు అందజేయాలని కోరారు. -
సైకో రవి అరెస్టు
బెంగళూరు, న్యూస్‌లైన్: కిడ్నాప్‌లు, లైంగిక దాడులు, దోపిడీలతో మూడు రాష్ట్రాల్లో కల్లోలం సృష్టించిన సైకో రవిని బెంగళూరు పోలీసులకు పట్టుబడ్డాడు. బెంగళూరు గ్రామీణ జిల్లా, హొసకోటే సమీపంలోని గ్రామానికి చెందిన జనార్దన్ అలియాస్ రాహు అలియాస్ సైకో రవి (32)ని అరెస్టు చేసి విచారణ చేస్తున్నట్లు బెంగళూరు పోలీస్ కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ తెలిపారు. మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. నిందితుడు బాలికలు, యువతులను మభ్యపెట్టి కిడ్నాప్ చేసి నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి లైంగిక దాడులకు పాల్పడి నగలు, నగదు దోపిడీ చేసి విడచి పెట్టేవాడన్నారు. ఇలా నిందితుడిపై రాష్ర్టంతోపాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోని పోలీస్ష్టేషన్లలో 32 కేసులు నమోదయ్యాయన్నారు. పలు కేసుల్లో గతంలో అరెస్టు అయిన సైకో రవి బెయిల్‌పై బయటకు వచ్చి పాత వృత్తిని చేపట్టాడన్నారు. ఈ క్రమంలో ఇటీవల మహదేవపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాలికను కిడ్నాప్ చేసి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని బాగేపల్లి వద్ద విడిచి ఉడాయించాడన్నారు. మహదేవపుర, మడివాళ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పాడి నిందితుడిని చాకచక్యంగా అరెస్టు చేశారన్నారు