బెంగళూరు, న్యూస్‌లైన్: కిడ్నాప్‌లు, లైంగిక దాడులు, దోపిడీలతో మూడు రాష్ట్రాల్లో కల్లోలం సృష్టించిన సైకో రవిని బెంగళూరు పోలీసులకు పట్టుబడ్డాడు. బెంగళూరు గ్రామీణ జిల్లా, హొసకోటే సమీపంలోని గ్రామానికి చెందిన జనార్దన్ అలియాస్ రాహు అలియాస్ సైకో రవి (32)ని అరెస్టు చేసి విచారణ చేస్తున్నట్లు బెంగళూరు పోలీస్ కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ తెలిపారు. మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. నిందితుడు బాలికలు, యువతులను మభ్యపెట్టి కిడ్నాప్ చేసి నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి లైంగిక దాడులకు పాల్పడి నగలు, నగదు దోపిడీ చేసి విడచి పెట్టేవాడన్నారు.
ఇలా నిందితుడిపై రాష్ర్టంతోపాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోని పోలీస్‌ష్టేషన్లలో 32 కేసులు నమోదయ్యాయన్నారు. పలు కేసుల్లో గతంలో అరెస్టు అయిన సైకో రవి బెయిల్‌పై బయటకు వచ్చి పాత వృత్తిని చేపట్టాడన్నారు. ఈ క్రమంలో ఇటీవల మహదేవపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాలికను కిడ్నాప్ చేసి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని బాగేపల్లి వద్ద విడిచి ఉడాయించాడన్నారు. మహదేవపుర, మడివాళ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పాడి నిందితుడిని చాకచక్యంగా అరెస్టు చేశారన్నారు
సైకో రవి అరెస్టు
Published Wed, Aug 28 2013 2:47 AM | Last Updated on Sat, Jul 28 2018 8:35 PM
Advertisement
Advertisement