
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, సుల్తాన్‌బజార్( హైదరాబాద్): ప్రేమించి పెళ్లి చేసుకుని మొఖం చాటేసిన తన భర్త, ఆయన కుటుంబ సభ్యులపై పోలీసులు చర్యలు చేపట్టేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని బాధితురాలు స్తానం వెంకట్‌లక్ష్మీ ప్రభుత్వానికి మొరపెట్టుకుంది. హైదర్‌గూడలోని ఎన్‌ఎస్‌ఎస్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 2012లో ఓ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నప్పుడు సాయినగర్ జిల్లెలగూడకు చెందిన స్తానం అఖిలేష్ ప్రేమించాడని, 2018 మే 11న అన్నవరంలో తమ వివాహం జరిగిందని తెలిపారు.
ఏడాదిన్నర కాలంగా ఇద్దరం కలిసే ఉన్నామని, అయితే తన భర్త తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువుల ఒత్తిడితో తనను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె వాపోయింది. సరూర్‌నగర్ మహిళా పోలీస్‌స్టేషన్‌తో పాటు రాచకొండ సీపీని కలిసినా న్యాయం జరగలేదని, పోలీసులు కేసు నమోదు చేసుకున్నా తన భర్త, అతడి బంధువులపై చర్యలు తీసుకోలేదని ఆమె ఆరోపించారు. తనకు విడాకులు ఇవ్వకుండా 2018లో తేజస్వీని తన భర్త వివాహం చేసుకున్నాడని, ఇప్పటికైనా డీజీపీ స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment