నగరంలోని బేగంపేటలో ఓ యువతి హల్‌చల్ చేసింది. రద్దీగా ఉన్న రోడ్డుపై తన కారుతో ఇష్టానుసారంగా డ్రైవింగ్ చేసుకుంటూ వాహనదారుల పైకి దూసుకెళ్లగా.. క్షణాల్లో అప్రమత్తమైన నలుగురైదు వాహనదారులు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ర్యాష్ డ్రైవింగ్ పై ప్రశ్నించినందుకు ఓ సిగ్నల్ వద్ద ట్రాఫిక్ పోలీసుల ఎదుటే యువతి వీరంగం చేసింది.