ఆకాంక్షా వర్మ.. అందం, అభినయం, మధురమైన స్వరానికి పర్యాయంగా అనిపిస్తుంది.. కనిపిస్తుంది! ఆ ప్రతిభతోనే మోడల్‌గా, ఆర్‌జేగా, టీవీ, వెబ్ స్క్రీన్ నటిగా తనకంటూ ఓ స్థానాన్ని సృష్టించుకుంది.
► పుట్టింది, పెరిగింది భోపాల్‌లో. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ముందు మోడలింగ్ అవకాశాలు వచ్చాయి.
► మోడలింగ్ చేస్తూనే థియేటర్ ఆర్టిస్ట్‌గా చేరింది. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గానూ పని చేసింది.
► ఆర్‌జేగా ఆమె చేసిన ‘బాలీవుడ్ టైమ్స్’ షోతో పాపులర్ అయ్యింది. ఆ సమయంలోనే అంటే 2016లో దూరదర్శన్‌లో ప్రసారమయ్యే ‘నమస్కార్ ఎమ్.పి’ షోకు యాంకరింగ్ చేయడంతో మొదటిసారి ఆకాంక్షాను ప్రేక్షకులు గుర్తించారు. అవకాశాలూ దరి చేరాయి.
► తీయని గొంతుతోనే కాదు చక్కని అభినయంతోనూ మెప్పిచంగలనని నిరూపించుకుంది.
► స్టార్ ఇండియా ప్రొడక్షన్‌లోని ‘మంగళ’ అనే సీరియల్‌లో ప్రధాన పాత్ర ‘జీజీ మా’గా జీవించి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకుంది. తర్వాత మరికొన్ని సీరియల్స్, షార్ట్ మూవీస్‌లోనూ నటించింది.వెబ్ దునియా కూడా ఆమె టాలెంట్‌ను క్యాప్చర్ చేసింది ‘గందీ బాత్ 4’ సిరీస్‌లో.
అవకాశాలేవి లేని, రాని టైమ్‌లో నా భర్త సుదర్శన్ ప్రోత్సాహంతో ఆర్‌జేగా ట్రై చేశాను. అదే నన్ను ఇప్పుడు ఈ స్థాయిలో నిలబెట్టింది. త్వరలో సినిమాల్లోనూ నటిస్తా. – ఆకాంక్షా వర్మ
Comments
Please login to add a commentAdd a comment