
కబాలి ఆడియో లీకైందా?
కబాలి ఆడియో లీకైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో రజనీకాంత్ డైలాగులతో కూడిన 30 సెకండ్ల ఆడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న కబాలి ఆడియో రిలీజ్ ఉన్నట్టుండి రద్దయింది. తలైవా రజనీకాంత్ ఇంకా అమెరికాలోనే ఉండటంతో ఆదివారం విడుదల చేయాలనుకున్న ఆడియోను మరికొంత కాలం వాయిదా వేశారు. అంతేకాదు.. సినిమా విడుదల కూడా జూలై 1 నుంచి 15వ తేదీకి వాయిదా పడినట్లు తెలుస్తోంది. అయితే.. ఈలోపు సినిమా వర్గాలకు మరో షాక్ ఇచ్చేలా.. కబాలి ఆడియో లీకైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో రజనీకాంత్ డైలాగులతో కూడిన 30 సెకండ్ల ఆడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. వాట్సప్‌లో ఇది చాలా మందికి ఇప్పటికే చేరిపోయింది. అది నిజమైనదో కాదో తెలియదు కానీ.. చాలామంది మాత్రం అది కబాలి సినిమాలోనిదేనని చెబుతున్నారు. (చదవండి: కబాలి యాప్‌తో సరికొత్త ట్రెండ్)
తలైవా రజనీకాంత్ నటించిన 159వ సినిమా కబాలి. అందులో ఆయన వయసు మళ్లిన డాన్ పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో రజనీ సరసన రాధికా ఆప్టే నటిస్తోంది. దినేష్, ధన్సిక, కలైరాసన్ లాంటివాళ్ల ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్న ఈ సినిమాకు పా రంజిత్ దర్శకత్వం వహించారు.