అమెరికాలో రజనీకాంత్
తమిళసినిమా: నటుడు రజనీకాంత్ అమెరికా చుట్టేస్తున్నారు. ఆయన అక్కడ జాలీగా షాపింగ్ చేస్తున్న ఫొటోలు, రైల్లో పయనిస్తున్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడిమాలో హల్‌చల్ చేస్తున్నాయి. రజనీకాంత్ ప్రతి ఏడాది అమెరికాకు వెళ్లి అక్కడ ఆరోగ్యానికి సంబంధించిన జనరల్ చెకప్ చేయించుకుని, పనిలో పనిగా తన గురువు సచ్చితానంద ఆశ్రమానికి వెళ్లి ధ్యానం చేస్తారు, అలా వారం లేక 10 రోజులు గడిపి చెన్నైకి తిరిగిరావడం ఆనవాయితీ. అదే విధంగా 2.ఓ, కాలా చిత్రాలను పూర్తి చేసిన ఈ సూపర్‌స్టార్ మరో కొత్త చిత్రానికి సిద్ధం అవుతున్నారు. మరో పక్క రాజకీయ పార్టీ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రజనీకాంత్ గత 23వ తేదీన జనరల్ వైద్యపరిశోధన కోసం అమెరికా వెళ్లారు.
ఈ సందర్భంగా ఆయన అమెరికాలో రైలు ప్రయాణం చేస్తున్న ఫొటో, షాపింగ్ చేస్తూ ఎస్కిలేటర్‌పై స్టైల్‌గా నిలబడిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఆయన నీట్‌గా జుత్తు కట్ చేసుకుని, తలకు రంగు వేసుకుని, తెల్లని గడ్డం, మీసాలతో చాలా స్టైల్‌గా, యూత్‌ఫుల్‌గా పుల్ జోష్‌గా కనిపిస్తున్న ఆ ఫొటోలను చూసిన అభిమానులు సంతోషంలో మునిగిపోతున్నారు. రజనీకాంత్ మరో నాలుగు రోజుల పాటు అమెరికాలోనే ఉండి చెన్నైకి తిరిగి వచ్చిన తరువాత కార్తీక్‌సుబ్బరాజ్ దర్శకత్వంలో నటించనున్న తాజా చిత్రానికి సంబంధించిన కార్యక్రమాల్లో లీనం అవుతారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment