అల్లూరి,సాక్షి: వైఎస్సార్‌సీపీ ఓటు బ్యాంకును చీల్చడమే విపక్షాల కుట్రగా కనిపిస్తోంది. చంద్రబాబు డైరెక్షన్‌లో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల కూడా ఈ చీఫ్ ట్రిక్స్‌లో భాగం అయ్యారు. తాజాగా ఆమె ఆడియో క్లిప్ బయటకు రావడంతో ఆ కుట్ర బయటకు వచ్చింది.
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ తరఫున బుల్లిబాబు పోటీ చేస్తున్నాడు. అయితే ఈయన అభ్యర్థిత్వం కంటే ముందు ఇక్కడ రేసులో ఉంది వంతల సుబ్బారావు. బుల్లిబాబు వైఎస్సార్‌సీపీ నుంచి కాంగ్రెస్‌లోకి చేరారు. చేరి చేరగానే బుల్లిబాబునే పాడేరు అభ్యర్థిగా షర్మిల ప్రకటించారు. దీంతో తీవ్రంగా నొచ్చుకున్న సుబ్బారావు కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు.
కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీలకే కాకుండా.. ఓటు బ్యాంకు ఏనాడో కనుమరుగైన కాంగ్రెస్‌లోనూ రెబల్స్ పోటు ఆసక్తికర చర్చకు దారి తీసింది. దీంతో వంతల సుబ్బారావుతో రాయబారానికి దిగారు. మీరు సొంత అన్నమాదిరి అని, అర్థం చేసుకోవాలని, తర్వాతిసారి చూద్దాం అంటూ బతిమాలాడారామె.
అయితే.. ఏనాడూ జెండా మోయనోడికి టికెట్ ఇవ్వడం తనను బాధించిందని, పైగా తనతో మాట కూడా చెప్పకుండా వేల మంది ముందు బుల్లిబాబును అభ్యర్థిగా ప్రకటించడం తనను నిరాశ పర్చిందని షర్మిలతో ఆయన అన్నారు.
కాంగ్రెస్ ఓటు బ్యాంకుతో పాటు వైఎస్సార్‌సీపీ ఓటు బ్యాంకు కలిసి వస్తుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు షర్మిల వంతల సుబ్బారావుకు స్పష్టం చేశారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే కాంగ్రెస్ గురించి మరిచిపోవాలంటూ బెదిరింపు స్వరంతో కోరారామె. చివర్లో.. కాంగ్రెస్‌కు డ్యామేజ్ చేయొద్దంటూ షర్మిల కోరగా.. తన భవిష్యత్తు ఆల్రెడీ డ్యామేజ్ అయ్యిందని ఆయన బదులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment