వాషింగ్టన్: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ఇబ్బందుల్లో పడింది. ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తన ఉద్యోగులతో మాట్లాడిన అంతర్గత ఆడియో బహిర్గతం కావడం దుమారం రేపుతోంది. ప్రధానంగా డెమొక్రాటిక్ అభ్యర్థి ఎలిజబెత్ వారెన్ అధ్యక్షురాలిగే ఎన్నికైతే ప్రమాదమని, చట్టపరమైన సవాళ్లు ఎదురవుతాయనీ జుకర్ బర్గ్ వ్యాఖ్యానించారు. అయితే సంస్థను విచ్ఛిన్నం చేయాలనే ప్రయత్నాన్ని తాము గట్టి ఎదుర్కొంటామంటూ సవాల్ చేస్తూ ప్రసంగించిన ఆడియో ఒకటి సంచలనంగా మారింది.
ఉద్యోగులతో నిర్వహించిన అంతర్గత ముఖాముఖి సందర్బంగా ఈ వ్యాఖ్యాలు చేశారని 'ది వెర్జ్' నివేదించింది. లీక్ అయిన ఆడియో ప్రకారం జుకర్‌బర్గ్ ప్రధానంగా ఆరు అంశాలపై తన ప్రసంగాన్ని చేశారు. అమెరికా ప్రభుత్వం ఫేస్‌బుక్‌ను విచ్ఛిన్నం చేయడంతోపాటు, వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌తో పోటీపడాలనే తమ లక్ష్యాన్నిదెబ్బతీయాలని భావిస్తోందన్నారు. ఎలిజబెత్ వారెన్ అమెరికా అధ్యక్షురాలిగా ఎన్నికైతే, ఎదురు దెబ్బలు, చట్టపరమైన సమస్యలు తప్పవని భావిస్తున్నట్టు చెప్పారు. ఈ ప్లాన్స్‌ను తాము తొప్పికొట్టగలమనే ధీమాను వ్యక్తం చేశారు. అంతేకాదు ఫేస్‌బుక్, అమెజాన్, గూగుల్ లాంటి దిగ్గజ టెక్ కంపెనీలను ఆమె టార్గెట్ చేశారన్నారు. యూత్‌లో భారీ క్రేజ్ సంపాదించుకుని శరవేగంగా దూసుకుపోతున్న చైనా కంపెనీ సొంతమైన టిక్‌టాక్‌పైకూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. టిక్‌టాక్‌ను ఎదుర్కొనేందుకు కొత్త వీడియో షేరింగ్ యాప్ లాసోను ప్రయోగాత్మకంగా లాంచ్ చేయనున్నట్టుచెప్పారు. దీంతోపాటు ఫేస్‌బుక్ క్రిప్టో కరెన్సీ లిబ్రా గురించి కూడా ప్రస్తావించారు. అంతేకాదు ట్విటర్ మొత్తం ఆదాయం కంటే సెక్యూరిటీకోసం ఫేస్‌బుక్ ఎక్కువ పెట్టుబడులు పెడుతోందని జుకర్‌బర్గ్ చెప్పుకొచ్చారు.
అటు వారెన్ కూడా వరుస ట్వీట్లతో ఫేస్‌బుక్‌లై విమర్శలు గుప్పించారు. ఫేస్‌బుక్ వంటి దిగ్గజ సంస్థలను చట్టవిరుద్ధమైన యాంటికాంపేటివ్ పద్ధతుల్లో పాల్గొనడానికి, వినియోగదారుల గోప్యతా హక్కులపై విరుచుకుపడటానికి అనుమతించే అవినీతి వ్యవస్థను, తాము అడ్డుకుంటే నిజంగా 'సక్' అవుతుందని వరుస ట్వీట్లలోమండిపడ్డారు. సమర్థవంతమైన పోటీదారులైన వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లను సొంతం చేసుకోవడం ద్వారా ఫేస్‌బుక్ ఇటీవలి కాలంలోఎక్కువ మార్కెట్ ఆధిపత్యాన్ని సంపాదించిందని, సోషల్ నెట్‌వర్కింగ్ ట్రాఫిక్‌లో 85శాతం కంటే ఎక్కువ ఫేస్‌బుక్ యాజమాన్యంలోని సంస్థలకు పోతోందన్నారు.
We have to fix a corrupt system that lets giant companies like Facebook engage in illegal anticompetitive practices, stomp on consumer privacy rights, and repeatedly fumble their responsibility to protect our democracy. #BreakUpBigTech https://t.co/c0qWuRb9NN
— Elizabeth Warren (@ewarren) October 1, 2019
Let's talk a bit about my plan to #BreakUpBigTech and why it's got Mark Zuckerberg so worked up.
— Elizabeth Warren (@ewarren) October 1, 2019
మరోవైపు వెర్జ్ కథనాన్ని ఖండిస్తూ జుకర్‌బర్గ్ తన ఫేస్‌బుక్ పేజీలో ఒక ప్రకటనను విడుదల చేశారు. ఇది పూర్తిగా అంతర్గతమే అయినప్పటికీ .. ఆసక్తి వున్నవాళ్లు ఫిల్టర్ చేయని వెర్షన్‌ను చెక్ చేసుకోవచ్చని ఒక లింక్‌ను షేర్ చేశారు. కాగా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్‌టిసి) ఫేస్‌బుక్‌పై బహిరంగ యాంటీ ట్రస్ట్ దర్యాప్తును ఎదుర్కొంటోంది. న్యూయార్క్లోని స్టేట్ అటార్నీ జనరల్ బృందం కూడా ఫేస్‌బుక్‌పై దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment