తిరుపతి : చిత్తూరు జిల్లాలో శనివారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సత్యవేడు శ్రీసిటీ సెజ్‌లోని ఓ పరిశ్రమలో కార్మికులు ఆందోళనకు దిగడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.
స్థానిక ఓ పరిశ్రమలో 40 మంది కాంట్రాక్టు కార్మికులను యాజమాన్యం తొలిగించింది. దీంతో కార్మికులు పరిశ్రమ ముందు ఆందోళనకు దిగారు. ముందస్తుగా భారీగా పోలీసులను మెహరించారు. తొలగించిన తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
సత్యవేడు శ్రీసిటీ సెజ్‌లో ఉద్రిక్తత
Published Sat, Feb 11 2017 10:57 AM | Last Updated on Tue, Sep 5 2017 3:28 AM
Advertisement
Advertisement