workers protests
-
విశాఖ ఉక్కు: 3వేల మంది కార్మికులతో ‘చలో పార్లమెంట్’
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కార్యాచరణ విడుదల చేసింది. ఇక నుంచి ఉద్యమాన్ని జాతీయస్థాయిలో ఉధృతం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆగస్టు 2, 3 తేదీల్లో 3వేల మంది కార్మికులతో ‘చలో పార్లమెంట్’ నిరసన కార్యక్రమాన్ని చేపడతమని పేర్కొంది. ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. -
విశాఖలో నినదించిన ఉక్కు నినాదం..
-
విశాఖలో నినదించిన ఉక్కు నినాదం..
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరం ఉక్కు నినాదాలతో మార్మోగింది. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలంటూ కార్మికులు రోడ్డెక్కారు. గత కొంతకాలంగా దీక్షలు చేపట్టిన ఉద్యమకారులు శుక్రవారం ఉదయం 11 గంటలకు నగరంలోని అన్ని రోడ్లపై బైఠాయించారు. జాతీయ రహదారిపై గాజువాక, ఇసుకతోట, మద్దిలపాలెం జంక్షన్ వద్ద నిరసనను వ్యక్తం చేశారు. రోడ్డెక్కి రాస్తారోకో నిర్వహించారు. గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు.. నిలువరించడానికి ప్రయత్నించినప్పటికీ ఉద్యమకారులు వెనక్కి తగ్గలేదు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను పరిరక్షించుకుంటామంటూ నినాదాలు చేశారు. ఈ పరిస్థితుల మధ్య పోలీసులకు ఉద్యమకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. చదవండి: చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి సవాల్.. బాబు బూతు పురాణం: రెచ్చగొట్టి.. రచ్చచేసి! -
‘ఉక్కు’ ఉద్యమం ఉధృతం..
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్ కోసం ఉద్యమం ఉధృత రూపం దాల్చింది. ప్రైవేటీకరణపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కూర్మన్నపాలెం స్టీల్ ప్లాంట్ ఎదుట కార్మికులు శుక్రవారం రిలే దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలకు మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే నాగిరెడ్డి సంఘీభావం తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కార్మికుడు డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. స్టీల్‌ప్లాంట్‌పై జేఏసీ.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించింది. ఈనెల 18న స్టీల్ ప్లాంట్ ఆవిర్భావ దినోత్సవాన్ని బహిష్కరించిన జేఏసీ.. ఈ నెల18నే స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ దినోత్సవంగా ప్రకటించింది. గాజువాకలో ఈనెల 18న కార్మికుల బహిరంగ సభ నిర్వహించడానికి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సన్నాహాలు చేస్తోంది. స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం చిన్నచూపు చూస్తోందన్నారు. అమరుల త్యాగాలు తెలియకుండా మాట్లాడటం బాధాకరమన్నారు. స్టీల్‌ప్లాంట్ విషయంలో కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అవంతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. (చదవండి: ప్రైవేటీకరణకు బీజం పడింది చంద్రబాబు హయాంలోనే..) ఓటర్లకు మంత్రం.. టీడీపీ క్షుద్ర తంత్రం! -
కుటుంబాలతో కలిసి ఆందోళన..
యాదగిరిగుట్ట : ఆర్టీసీ కార్మికులు సమ్మె ఉధృతం చేశారు. 17వ రోజు సోమవారం కుటుంబసభ్యులతో కలిసి ఆందోళన చేపట్టారు. కార్మికులతో చర్చలు జరపాలని హైకోర్టు సూచించిన నేపథ్యంలో సమస్య కొలిక్కి వస్తుందని ఆశించినా.. సర్కార్ ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించకపోవడంతో పరిస్థితి యథావిధిగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కార్మికులు తమ సమ్మెను ఉధృతం చేసేందుకు నెలాఖరు వరకు ఉద్యమ కార్యాచరణను ప్రకటించి సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయించారు. జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ జేఏసీ కార్మికులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఆయా కార్మిక సంఘాలు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. కార్మికులు వినూత్న నిరసన ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు కార్మికులంతా తమ కుటుంబ సభ్యులతో కలిసి యాదగిరిగుట్ట ఆర్టీ సీ డిపో గేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. మ హిళా కార్మికులు బతుకమ్మ, కబడ్డీ ఆడి నిరసన తెలియజేశారు. ఈ సందర్భం గా పలువురు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు ప్రగతి చక్రాలను ఆపి ప్రత్యేక రాష్ట్రం సాధనకు పోరాడారని గుర్తుచేశారు. ఉద్యమంలో కీలకంగా పనిచేసిన తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని సమ్మెలోకి వెళ్తే తమ ఉద్యోగాల నుంచి తొలగిస్తామని సీ ఎం కేసీఆర్ ప్రకటించడం బాధాకరమన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తే కలిగే ప్ర యోజనాలను సీఎం కేసీఆర్‌కు ఆర్టీసీ జేఏసీ నాయకులు గతంలోనే వివరించారని, కానీ ఆర్టీసీ నష్టాల్లో ఉందని, ప్రయివేటీకరణ చేసే దిశగా వ్యూహాలు రచించడం మంచిది కాదన్నారు. విద్యార్థులకు తప్పని ఇబ్బందులు.. దసరా సెలవుల పూర్తయిన తరువాత రాష్ట్ర ప్ర భుత్వం ఆర్టీసీ కార్మికుల సమ్మెను దృష్టిలో పెట్టుకొని ఈ నెల 19వ తేదీ వరకు విద్యా సంస్థలకు సెలవులను పొడగించిన విషయం తెలిసిందే. సోమవారం నుంచి విద్యాసంస్థలు తిరిగి ప్రా రంభమయ్యాయి. కానీ వివిధ రూట్లలో ఉద యం నడిచే బస్సులు సరైన సమయానికి వెళ్లకపోవడంతో విద్యార్థులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు సమయానికి బస్సులు నడపకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్డెక్కిన 69 బస్సులు సోమవారం ఆర్టీసీ 56, ప్రైవేట్‌కు చెందిన 13బస్సులను అధికారులు రోడ్డెక్కించారు. మొదటి రోజు మాదిరిగానే ఆర్టీసీ అధికారులు బస్సులకు ముందు పోలీస్ ఎస్కార్ట్ వాహనాలతో తీసుకెళ్లారు. బస్టాండ్, డిపో ఆవరణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏసీపీ మనోహర్‌రెడ్డి, పట్టణ ఇన్స్పెక్టర్ నర్సింహారావు ఆధ్వర్యంలో పోలీసు నిఘా పెట్టారు. ఇన్చార్జ్ డీఎంగా రమేష్ యాదగిరిగుట్ట డిపో ఇన్చార్జ్ మేనేజర్‌గా రమేష్ సోమవారం బాధ్యతలను స్వీకరించారు. డిపో మేనేజర్‌గా పని చేసిన రఘుకు ఆదివారం అర్ధరాత్రి నుంచి తీవ్ర జ్వరం రావడంతో ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన స్థానంలో ఇన్చార్జ్ డీఎంగా రమేష్‌ను పంపించారు. -
కదం తొక్కిన కార్మికులు
టెక్కలి (శ్రీకాకుళం): డివిజన్ కేంద్రమైన టెక్కలిలో రావివలస మెట్కోర్ ఎల్లాయ్సెస్ పరిశ్రమ కార్మికులు కదం తొక్కారు. తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. కార్మికుల నిరసనకు వైఎస్సార్ సీపీ నాయకులు మద్దతు పలికారు. సుమారు 200 మంది కార్మికులు అర్ధనగ్నంగా పరిశ్రమ నుంచి ర్యాలీ ప్రారంభించి ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని తమ న్యాయపరమైన సమస్యలపై నినాదాలు చేశారు. అనంతరం స్థానిక అంబేడ్కర్ కూడలిలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ 2015 సంవత్సరంలో రావివలస మెట్కోర్ ఎల్లాయ్సెస్ పరిశ్రమకు లాకౌట్ ప్రకటించారని అప్పటి నుంచి మంత్రి అచ్చెన్నాయుడు చుట్టూ తిరుగుతున్నప్పటికీ తమ సమస్యలను పరిష్కరించకుండా మమ్మల్ని రోడ్డున పడేశారంటూ కార్మికులు వాపోయారు. సుమారు మూడేళ్లుగా ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ తమను విస్మరిస్తున్నారంటూ కార్మికులు వాపోయారు. తక్షణమే తమకు రావాల్సిన 20 నెలల వేతనాలు, 4 సంవత్సరాల పీఎఫ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే పరిశ్రమను తక్షణమే తెరిపించాలని లేని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు. అనంతరం వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ మాట్లాడుతూ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న అచ్చెన్నాయుడు కార్మిక శాఖ మంత్రిగా పదవి చేపట్టిన తర్వాత రావివలస పరిశ్రమను మూత వేశారని ఆరోపించారు. అప్పటి నుంచి కార్మికులు నడిరోడ్డున పడినప్పటికీ అచ్చెన్నాయుడుకు కనీసం కార్మికులను ఆదుకోవాలనే ఆలోచన రాకపోవడం భాదాకరమన్నారు. రావివలస మెట్కోర్ పరిశ్రమ యాజమాన్యం నుంచి అచ్చెన్నాయుడు తాయిలాలు అందుకున్నారని అందుకే సుమారు 300 మంది కార్మికులకు అన్యాయం చేశారని ఆరోపించారు. కార్మికుల పక్షాన పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వారికి న్యాయం చేయకపోతే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామంటూ తిలక్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు జి.గురునాథ్ యాదవ్, టి.కిరణ్, చిన్ని జోగారావు, శ్యామలరావు, మదీన్తో పాటు జనసేనా కార్యకర్త ఎ.శ్రీధర్, అధిక సంఖ్యలో కార్మికులు తదితరులు పాల్గొన్నారు. -
‘డిమాండ్లను పరిశీలించేదాకా సమ్మె’
నిజామాబాద్ నాగారం : విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల డిమాండ్లను పరిష్కరించేదాకా సమ్మె విరమించేది లేదని తెలంగాణ విద్యుత్ కాంట్రాక్టు కా ర్మికుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మెట్టు జాషువా పేర్కొన్నారు. సమ్మె మంగళ వారం నాలుగో రోజుకు చేరింది. విద్యుత్‌శాఖ జిల్లా కార్యాలయం ఎదుట కార్మికులు అర్ధ నగ్న ప్రద ర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జాషు వా మాట్లాడుతూ ఏళ్ల తరబడిగా చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నామన్నారు. ఉద్యోగ భద్రత కల్పిం చాలని, సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. టీడీపీ నాయకులు సమ్మెకు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లయ్య, ప్రధాన కార్యదర్శి ఎండీ ముస్తాక్, ప్రతినిధులు శంకర్, ఇబ్రహీం, నవీన్, నాగర్జున, సాగర్ తదితరులు పాల్గోన్నారు. అండగా ఉంటాం.. విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమస్య ప్రస్తుతం కోర్టులో ఉందని 1104 జిల్లా ప్రాంతీయ కార్యదర్శి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. సమ్మె విరమిం చాలని కోరారు. కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోతే అందరం కలిసి ఐక్యంగా పోరాటాలు చేద్దామని 327 జిల్లా అధ్యక్షుడు ఎండీ జక్రియా, ప్రధాన కార్యదర్శి పూదరి గంగాధర్ పేర్కొన్నారు. కార్మికుల సమస్య కోర్టులో ఉందని, ప్రస్తుతం సమ్మె విరమించాలని టీఆర్వీకేఎస్ జిల్లా అధ్యక్షుడు శివాజీగణేశ్ కోరారు. కోర్టు ద్వారానే పరిష్కారం.. కామారెడ్డి అర్బన్: విద్యుత్ ఆర్టిజన్ల సమస్య కోర్టు ద్వారానే పరిష్కారం అవుతుందని 327 యూనియన్ జిల్లా అధ్యక్షుడు సంపత్‌రెడ్డి, కార్యదర్శి చంద్రశేఖర్, నాయకులు ఎడ్ల సంపత్‌కుమార్, నాగరాజు, రాజిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం 327 యూనియన్ నాయకులు ఒక ప్రకటన విడుదల చేశారు. 2015లో అన్ని కార్మిక సంఘాలతో టీఈటీయూఎఫ్గా ఏర్పడి మహా ఉద్యమాన్ని చేపట్టామని, 24 వేల మంది కార్మికులను విలీనం చేస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయని పేర్కొన్నారు. అయితే కోర్టు కేసు ఉన్నందున ఆర్టిజన్ కార్మికులుగా గుర్తించారని తెలిపారు. రెగ్యులరైజేషన్ అంశం కోర్టు ద్వారానే పరిష్కారం అవుతుందని పేర్కొన్నారు. గుర్తింపు సంఘాలు ఈ విషయాన్ని విస్మరించి సమ్మె చేయడం సరైన పద్ధతి కాదని, వెంటనే సమ్మె విరమించి, విధుల్లోకి రావాలని కోరారు. -
సత్యవేడు శ్రీసిటీ సెజ్‌లో ఉద్రిక్తత
తిరుపతి : చిత్తూరు జిల్లాలో శనివారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సత్యవేడు శ్రీసిటీ సెజ్‌లోని ఓ పరిశ్రమలో కార్మికులు ఆందోళనకు దిగడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. స్థానిక ఓ పరిశ్రమలో 40 మంది కాంట్రాక్టు కార్మికులను యాజమాన్యం తొలిగించింది. దీంతో కార్మికులు పరిశ్రమ ముందు ఆందోళనకు దిగారు. ముందస్తుగా భారీగా పోలీసులను మెహరించారు. తొలగించిన తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. -
ఆర్టీసీ డీఎం వేధింపులు : కార్మికుల నిరసన
-
ఆర్టీసీ డీఎం వేధింపులు : కార్మికుల నిరసన
సత్తెనపల్లి: గుంటూరుజిల్లాలో ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. సత్తెనపల్లి డిపో మేనేజర్ సి.బాలాజీ దయాళ్ వేధింపులకు నిరసనగా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ధర్నా చేపట్టారు. మహిళా కండక్టర్ జయలక్ష్మి ఆత్మహత్యాయత్నానికి డిపో మేనేజర్ వేధింపులే కారణమని ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. డీఎం వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు జయలక్ష్మి సోమవారం విజయవాడ వెళ్లారు. అక్కడ ఆర్టీసీ ఎండీని కలిసేందుకు వీలు కుదరకపోవడంతో ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. డిపో మేనేజర్ తీరుపై ఆర్టీసీ కార్మికులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనపై చర్య తీసుకోవాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. -
ఓసీటీఎల్ కార్మికుల ఆందోళన
నార్కెట్‌పల్లి : నల్లగొండ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నార్కెట్‌పల్లి ఓసీటీఎల్ పరిశ్రమలో కార్మికుల తొలగింపుపై వివాదం చెలరేగుతోంది. తమను విధుల్లోకి తీసుకొవాలని కోరుతూ.. పరిశ్రమ ఎదుట తొలగించిన కార్మికులు సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు. తమను విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన యాజమాన్యం కేసులు ఉన్న వారిని తీసుకునేదిలేదని స్పష్టంచేసింది. ఈ నిర్ణయంతో ఆగ్రహించిన కార్మికులు పరిశ్రమలోకి చొచ్చుకుపోవడానికి యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
సమ్మె పాట్లు.. దోపిడీ
{పైవేట్ వాహనాలు, ఆటోల ఇష్టారాజ్యం డిపోలకే పరిమితమైన 3800 బస్సులు కార్మికుల ధర్నాలు, ఆందోళనలతో అట్టుడికిన డిపోలు ఆర్టీసీ సమ్మె... బుధవారం సిటీలో జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రయాణికులు, ఉద్యోగులు, చిరు వ్యాపారులు ఇక్కట్ల పాలయ్యారు. ప్రైవేటు వాహనదారులు, ఆటోడ్రైవర్లు ప్రయాణికుల అవసరాలను ‘క్యాష్’ చేసుకున్నారు. ఇష్టారీతిలో చార్జీలు పెంచేసి నిలువు దోపిడీకి పాల్పడ్డారు. ప్రధాన బస్స్టేషన్లలో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు రోజంతా పడిగాపులు కాశారు. సమ్మె విషయం తెలియక బస్టాండ్లకు వచ్చి నిరాశగా తిరుగుముఖం పట్టారు. మరోవైపు ఎంఎంటీఎస్, సెట్విన్ బస్సులు కిక్కిరిసినడిచాయి. గ్రేటర్‌పరిధిలోని 28 డిపోలలో ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లు, సూపర్వైజర్లు, క్లరికల్ సిబ్బంది సహా 20 వేల మందికి పైగా సమ్మెలో పాల్గొన్నారు. దాదాపు 3800 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.- సాక్షి, సిటీబ్యూరో సిటీబ్యూరో : ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె మొదటి రోజు బుధవారం విజయవంతమైంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని 28 డిపోలలో ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. అన్ని డిపోలు, రీజనల్ కార్యాలయాలు, ప్రధాన బస్స్టేషన్ల వద్ద కార్మికులు ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వానికి, ఆర్టీసీ యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడబోమని, న్యాయమైన కోర్కెలను సాధించుకొనే వరకు సమ్మె కొనసాగుతుందని ఎంప్లాయీస్ యూనియన్, టీఎంయూ నాయకులు ప్రకటించారు. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆర్టీసీ చేపట్టిన చర్యలు పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రైవేట్ సిబ్బంది సహాయంతో 70 బస్సులను నడుపగలిగినట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ జయరావు తెలిపారు. మరోవైపు తాత్కాలిక సిబ్బంది బస్సులు బయటకు తీయకుండా పలు చోట్ల ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు అడ్డుకున్నారు. కంటోన్మెంట్, ఉప్పల్,రాణీగంజ్, మెహదీపట్నం,రాజేంద్రనగర్, మియాపూర్, కూకట్పల్లి, జీడిమెట్ల, పటాన్చెరు, బండ్లగూడ, చెంగిచెర్ల, ఫలక్‌నుమా,కుషాయిగూడ,మేడ్చెల్, తదితర డిపోలలో యాజమాన్యం చర్యలను నిరసిస్తూ కార్మికులు ఆందోళనకు దిగారు. పలు చోట్ల పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది సహాయంతో అధికారులు బస్సులు బయటకు తీసేందుకు ప్రయత్నించారు. నిలువుదోపిడీ... కార్మికుల సమ్మె నేపథ్యంలో మహాత్మాగాంధీ, జూబ్లీ, దిల్సుఖ్నగర్, కోఠి, రెతిఫైల్ తదితర బస్స్టేషన్లు, ఆర్టీసీ ప్రాంగణాలు బోసిపోయాయి. ప్రతి రోజు 3500 బస్సుల రాకపోకలతో, లక్ష మంది ప్రయాణికులతో కళకళలాడే ఎంజీబీఎస్, జూబ్లీబస్స్టేషన్లు వెలవెలబోయాయి. సమ్మె పట్ల అవగాహన లేని దూరప్రాంతాల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విజయవాడ, గుంటూరు, ఖమ్మం, కరీంనగర్ తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణికులు ప్రైవేట్ బస్సులు, కార్లను ఆశ్రయించారు. సమ్మె దెబ్బతో ఆపరేటర్లు చార్జీలను అమాంతంగా రెట్టింపు చేశారు. నగరంలోనూ ప్రయాణికులు ఆటోవాలాల నిలువుదోపిడీకి గురయ్యారు. మీటర్లతో నిమిత్తం లేకుండా డబ్బులు డిమాండ్ చేశారు. సెవెన్ సీటర్ ఆటోలు, టాటా ఏస్ తదితర వాహనాలు సైతం దోపిడీ పర్వాన్ని కొనసాగించాయి. సాధారణ రోజుల్లో సికింద్రాబాద్ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వరకు ఆటో చార్జీ రూ.50 ఉంటే బుధవారం దాన్ని రూ.100 నుంచి రూ.125 కు పెంచేశారు. నాంపల్లి నుంచి ఖైరతాబాద్ వరకు రూ.40 లోపే ఉంటుంది. కానీ ఆటోవాలాలు రూ.100కు పెంచారు. అన్ని రూట్లలోనూ ఇదే పరిస్థితి. సాధారణ రోజుల్లో శివార్లకే పరిమితమయ్యే సెవెన్ సీటర్ ఆటోలు నగరం లోపలికి ప్రవేశించాయి. ఉప్పల్ నుంచి సికింద్రాబాద్ వరకు సెవెన్ సీటర్ చార్జీ మామూలుగా అయితే రూ.15 లోపే ఉంటుంది. కానీ బుధవారం రూ.30 నుంచి రూ.40 కి చేరుకుంది. కిక్కిరిసిన ఎంఎంటీఎస్ రైళ్లు బస్సులు బంద్ కావడంతో ప్రయాణికులు ఎంఎంటీఎస్ రైళ్లను ఆశ్రయించారు. దీంతో అన్ని వైపులా ఎంఎంటీఎస్ రైళ్లు కిక్కిరిసి తిరిగాయి. సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి వైపు, నాంపల్లి నుంచి హైటెక్‌సిటీ వైపు ప్రయాణికుల రద్దీ అనూహ్యంగా కనిపించింది. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ప్రైవేట్ బస్సులకు స్టేజీ క్యారేజీలుగా పర్మిట్లు ఇచ్చారు. స్కూళ్లు, కాలేజీ బస్సులు,ఇతర వాహనాలు ప్రయాణికులను ఎక్కించుకొనేందుకు అనుమతినిచ్చారు. అయినప్పటికీ ప్రయాణికుల రద్దీకి అనుగుణమైన రవాణా సదుపాయాలు లభించలేదు. కాంట్రాక్ట్ పద్ధతిలో చేరి విధులు నిర్వహిస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు గురువారం నుంచి తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని ఈడీ జయరావు ఒక ప్రకటనలో కోరారు. విధులకు హాజరు కాని పక్షంలో సర్వీసుల నుంచి తొలగిస్తామన్నారు.