
సాక్షి, తిరుపతి: టీడీపీ నేతల చేతిలో దాడికి గురైన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోలుకుంటున్నారు. తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ సిద్దా నాయక్ తెలిపారు. వేదాంతపురంలో ఆదివారం నిర్వహించిన పసుపు–కుంకుమ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై టీడీపీ నేతలు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.
కార్యక్రమంలో ఎమ్మెల్యే హోదాలో ప్రసంగిస్తున్న ఆయన్ని అడ్డుకుని, ఇది టీడీపీ కార్యక్రమం అని టీడీపీ నేతలు మైక్ కట్ చేయించారు. అధికారులు వారిస్తున్నా వినకుండా చెవిరెడ్డి పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డికి పోలీసులు, మహిళలు రక్షణగా నిలిచారు. దీంతో రెచ్చిపోయిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసులు, మహిళలపై రాళ్లు, కారం పొడి, స్వీట్ ప్యాకెట్లతో దాడి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment