
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ పేరుతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మహిళలను మోసం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తున్నందున పసుపు-కుంకుమ పేరుతో మరోసారి మోసానికి దిగారని మండిపడ్డారు. మహిళల తాళిబొట్టులు తెంపే విధంగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారని, మహిళల ద్రోహి చంద్రబాబు అని త్రీవస్థాయిలో ధ్వజమెత్తారు.
సోమవారం రోజా మీడియాతో మాట్లాడుతూ.. డ్వాక్రా రుణాలు మాఫీ చేసి ఉంటే రాష్ట్రంలో అక్కచెల్లెమ్మల ఆత్మహత్యలు ఉండేవికావని అన్నారు. పోస్ట్ డేటెడ్ చెక్కులతో ఔట్ డేటెడ్ సీఎం కొత్త నాటకాలకు తెరలేపారని రోజా ఆరోపించారు. టీడీపీ అరాచకాలను తట్టుకోలేని మహిళలు.. మంత్రి పరిటాల సునీతపై చెప్పులు, చీపుర్లతో తిరుగుబాటు చేశారని గుర్తుచేశారు. మహిళలకు న్యాయం చేయలేని సునీత.. వైఎస్ జగన్‌ను విమర్శించడం తగదని హితవుపలికారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేయగల సత్తా మీకు ఉందా ఉందా సవాలు చేశారు.
తనకు మరోసారి ఓటు వెయ్యాలని చంద్రబాబు అడుగుతున్నారనీ, ప్రజలకు ఏం చేశారని ఓటు వెయ్యాలని ఆమె ప్రశ్నించారు. నరకాసుర పాలన చేస్తున్న చంద్రబాబు పాలనకు చరమగీతం పాడాలని రోజా పిలుపునిచ్చారు. వైస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే నవరత్నాలు అమలుచేసి తీరుతామని ఆమె హామీ ఇచ్చారు. చిత్తూరు లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై టీడీపీ నేతల దాడిని రోజా ఖండించారు.
Comments
Please login to add a commentAdd a comment