
సాక్షి, విజయవాడ: చంద్రబాబుది ప్రజాచైతన్య యాత్ర కాదు.. పిచ్చోడి యాత్ర అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఆమె గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తాగుబోతుల సంఘం అధ్యక్షుడిలా చంద్రబాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జైలుకు వెళ్తాననే భయం చంద్రబాబుకు పట్టుకుందని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నవమాసాల పాలనతో నారావారి నవనాడులు చిట్లిపోయాయని ఆమె ధ్వజమెత్తారు.(తాగుబోతుల పొట్టకొడుతోంది)
అందుకే ఐటీ సోదాలు, దోపిడిపై మాట్లాడకుండా.. తేలు కుట్టిన దొంగల్లా చంద్రబాబు, లోకేష్ తిరుగుతున్నారని రోజా ఎద్దేవా చేశారు. ఐటీ దాడులతో ఎప్పుడు లోపలేస్తారోనని చంద్రబాబు భయపడుతున్నాడని ఆమె అన్నారు. అందుకే బస్ యాత్ర పేరుతో అబద్ధాలు చెబుతున్నాడని రోజా మండిపడ్డారు. ఐటీని తానే కనిపెట్టానని చెప్పుకునే బాబు.. ఇప్పుడు ఐటీ పేరు చెబుతేనే వణికిపోతున్నాడని ఆమె అన్నారు. (అది మామూలు విషయమా: విజయసాయిరెడ్డి)
Comments
Please login to add a commentAdd a comment