సీఎం సొంత జిల్లా చిత్తూరులో పచ్చ నేతలు మరోసారి రెచ్చిపోయారు. చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం వేదాంతపురంలో ఆదివారం అధికారికంగా నిర్వహించిన పసుపు–కుంకుమ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై దాడికి పాల్పడ్డారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే హోదాలో ప్రసంగిస్తున్న ఆయన్ని అడ్డుకున్నారు. ఇది టీడీపీ కార్యక్రమం అని, ఇందులో మీ ప్రసంగాలు ఏంటని? మైక్ కట్ చేయించారు. అధికారులు వారిస్తున్నా వినకుండా చెవిరెడ్డి పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఎమ్మెల్యే చెవిరెడ్డికి పోలీసులు, మహిళలు రక్షణగా నిలిచారు. దీంతో రెచ్చిపోయిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసులు, మహిళలపై రాళ్లు, కారం పొడి, స్వీట్ ప్యాకెట్లతో దాడి చేశారు.