
కొలిమిగుండ్లలో వివరాలు సేకరిస్తున్న ఎస్‌ఐ గిరిబాబు
కర్నూలు ,కొలిమిగుండ్ల/సంజామల: పసుపు– కుంకుమ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. కార్యక్రమం తాము నిర్వహించాలంటే తాము అంటూ పరస్పరం దాడులు చేసుకున్నారు. కొలిమిగుం డ్ల మండలం యర్రగుడి గ్రామ ప్రాథమిక పాఠశాల ఆవరణలో సాగునీటి సంఘం చైర్మన్ రామాంజనేయులు, నిమ్మకాయల రంగయ్య, చిన్న దస్తగిరి, గుర్విరెడ్డి వర్గీయుల మధ్య మాటలయుద్ధం ప్రారంభమై..చివరకు రాళ్లు రువ్వుకునేంత వరకు వెళ్లింది.
దీంతో సమావేశానికి హాజరైన యర్రగుడికి చెందిన నడిపి ఆశీర్వాదం, చాకలి రాముడు, హనుమంతుగుండంకు చెందిన శివమ్మతో పాటు పలువురు లబ్ధిదారులు గాయపడ్డారు. వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీయాల్సి వచ్చింది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ గిరిబాబు గ్రామానికి చేరుకొని ఘటనపై వివరాలు ఆరాతీశారు. సంజామల గ్రామ పంచాయతీ కార్యాలయంలో చెక్కుల పంపిణీ అనంతరం భోజన సమయంలో తెలుగు తమ్ముళ్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నాయకులు, కార్యకర్తలకు సరిపడా భోజనం లేకపోవడంతో టీడీపీ కార్యకర్తల మధ్య తన్నులాట జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment