
సాక్షి, కర్నూలు: అధికార పార్టీ పక్షపాత బుద్ధి మరోసారి నిరూపితమైంది. తమకు అనుకూలంగా ఉన్న వారికి దోచిపెడుతూ.. సామాన్య ప్రజలను విస్మరించటం పరిపాటిగా మారింది. ప్రభుత్వం చేపట్టిన పసుపు, కుంకుమ చెక్కుల పంపిణీ విషయంలో బుధవారం గొడవ చోటుచేసుకుంది. ఆత్మకూరులో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళలకు మాత్రమే చెక్కులు పంపిణీ చేస్తూ మిగిలిన మహిళలకు చెక్కులు పంచకపోవటంతో వివాదం మొదలైంది. దీంతో పొదుపు సంఘాల మహిళలు పోలీసులను ఆశ్రయించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత శిల్పాచక్రపాణి రెడ్డి వీరికి మద్దతుగా నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment