
సాక్షి, విజయవాడ : గత ఎన్నికల్లో 94 లక్షల మంది డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని మోసం చేసిన చంద్రబాబు.. మరోసారి ‘పసుపు-కుంకుమ’తో భారీ మోసం చేయడానికి సిద్ధమవుతున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గాయత్రి విమర్శించారు. ఆదివారం ఆమె మీడియా మాట్లాడుతూ.. డ్వాక్రా మహిళలకు చంద్రబాబు చెల్లని చెక్కులు ఇస్తున్నారని ఆరోపించారు. మరోసారి మహిళలను మోసం చేయడానికే ‘పసుపు-కుంకుమ’ పథకాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు. డ్వాక్రా మహిళలకు పదివేల రూపాయలు, స్మార్ట్ ఫోన్లు ఇస్తామని చెప్పడం పచ్చి మోసం అన్నారు.
ఈ ఐదేళ్లలో రాజధాని నిర్మాణం పేపర్ల మీదే ఎలా జరిగిందో.. అలాగే పది రూపాయలు చెక్కు మీదే ఉంటాయి కానీ ఒక్క రూపాయి చేతికి రావని చెప్పారు. గత ఎన్నికల్లో డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. రుణమాఫీ వాగ్దానాన్నే మాఫీ చేశారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు మహిళలు గట్టిగా బుద్ధి చెప్పాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment