
ఆ క్రికెటర్‌కు మన హీరోయిన్లు బాగా ఇష్టమట!
వెస్టిండీస్ క్రికెటర్ డ్వాన్ బ్రావో ఇప్పుడు బాలీవుడ్‌పై మనస్సు పడ్డాడు. ఇటీవల సినీనటి శ్రియాతో అతను చెట్టాపట్టాలు వేసుకొని తిరిగిన ఫొటో ఒకటి వెలుగులోకి వచ్చి హల్‌చల్ చేసింది. దీంతో ఈ ఇద్దరి మధ్య ఏదో జరగుతున్నట్టు, ఇద్దరు కలిసి ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నట్టు కథనాలు వచ్చాయి. అయితే, ఈ కథనాలపై నోరు విప్పని బ్రావో తాజాగా బాలీవుడ్‌పై తనకున్న ప్రేమను మాత్రం చాటుకున్నాడు.
‘దీపికా పదుకొనే అంటే నాకు ఇష్టం. జాక్వలిన్ ఫెర్నాండెజ్ అంటే పడి చస్తాను. హిందీ సినిమాల్లో నటించాలనుకుంటున్నాను. కరణ్ జోహర్ సినిమాలో అవకాశం వస్తే ఎగిరి గంతేసి నటిస్తాను’ అంటూ బ్రావో తెలిపాడు. ప్రస్తుతం ’ఝలక్ దిఖ్‌లాజా -9’ టీవీ డ్యాన్స్ షోలో పాల్గొంటున్న ఈ క్రికెటర్ ఐఏఎన్‌ఎస్ వార్తాసంస్థతో ముచ్చటించాడు. భారతీయ టీవీషోల్లో పాల్గొనటం ఎంజాయ్ చేస్తున్నానని చెప్పిన బ్రావో.. ఎక్కువగా హిందీ సినిమాలు చూడలేదని, కానీ అవకాశం వస్తే బాలీవుడ్‌లో నటిస్తానని చెప్పాడు. కరణ్ జోహార్ సినిమాలో దీపికా పదుకొనే సరసన నటించేందుకు తాను సిద్ధమని ప్రకటించాడు. బాలీవుడ్ హీరోయిన్లందరు తనకు నచ్చుతారని, ‘ఝలక్ దిఖ్‌లాజా -9’ టీవీ షో సందర్భంగా జాక్వలిన్ ఫెర్నాండెజ్‌ను కలిశానని, ఆమె ఎంతగానో నచ్చేసిందని చెప్పుకొచ్చాడు.