మరో బాలీవుడ్ బ్యూటీ హాలీవుడ్ ఎంట్రీ | Jacqueline Fernandez to make Hollywood debut | Sakshi
Sakshi News home page

మరో బాలీవుడ్ బ్యూటీ హాలీవుడ్ ఎంట్రీ

Feb 18 2016 12:47 PM | Updated on Sep 3 2017 5:54 PM

మరో బాలీవుడ్ బ్యూటీ హాలీవుడ్ ఎంట్రీ

మరో బాలీవుడ్ బ్యూటీ హాలీవుడ్ ఎంట్రీ

సౌత్లో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న హీరోయిన్లు బాలీవుడ్ వైపు చూసినట్టే, బాలీవుడ్లో టాప్ స్టార్స్గా ఉన్న భామలు హాలీవుడ్ ఛాన్స్ల కోసం ఎదురుచూస్తుంటారు. ఇప్పటికే కొంతమంది బాలీవుడ్ నటీనటులు హాలీవుడ్లో...

సౌత్లో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న హీరోయిన్లు బాలీవుడ్ వైపు చూసినట్టే, బాలీవుడ్లో టాప్ స్టార్స్గా ఉన్న భామలు హాలీవుడ్ ఛాన్స్ల కోసం ఎదురుచూస్తుంటారు. ఇప్పటికే కొంతమంది బాలీవుడ్ నటీనటులు హాలీవుడ్లో ఆకట్టుకుంటుండగా తాజాగా మరో బ్యూటీ ఈ లిస్ట్లో చేరనుంది. ఇప్పటికే దీపిక, ప్రియాంకలు హాలీవుడ్ సినిమాలతో సందడి చేస్తుండగా ఇప్పుడు జాక్వలిన్ ఫెర్నాండెజ్ కూడా హాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోంది.

ప్రస్తుతం డిష్యుం సినిమా పనుల్లో బిజీగా ఉన్న బాలీవుడ్ దర్శకుడు ఫగున్ థాకర్, వార్నర్ బ్రదర్స్ సంస్థతో కలిసి హాలీవుడ్లో ఓ భారీ సినిమాను తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం చర్చల దశలోనే ఉన్న ఈ ప్రాజెక్ట్ త్వరలోనే తుదిరూపుకు వచ్చే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఈసినిమాతో ఫగున్ తన స్నేహితురాలు జాక్వలిన్ ను హాలీవుడ్కు పరిచయం చేయాలని భావిస్తున్నాడు. త్వరలోను జాక్వెలిన్ హాలీవుడ్ ఎంట్రీ పై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement