భారతీయ వెండితెర మీద సత్తా చాటిన చాలామంది తారలు హాలీవుడ్‌లోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే ఒక్క ప్రియాంక చోప్రా తప్ప హాలీవుడ్ లో వరుస అవకాశాలు దక్కించుకున్న హీరోయిన్లు లేరనే చెప్పాలి. దీపికా పదుకొనే, ఐశ్వర్యా రాయ్ లాంటి వారు హాలీవుడ్ సినిమాల్లో నటించినా.. బాలీవుడ్ సినిమాల మీదే ఎక్కువగా దృష్టి పెట్టారు. తాజాగా ఈ లిస్ట్ లో మరో భారతీయ నటి చేరేందుకు రెడీ అవుతోంది.
సినిమాలతో కన్నా ఎక్కువగా వివాదాలతోనే వార్తల్లో ఉండే రాధికా ఆప్టే త్వరలో ఓ హాలీవుడ్ సినిమాలో నటించనుందట. ప్రముఖ హాలీవుడ్ నిర్మాత లిడియా డీన్ దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న హాలీవుడ్ సినిమాలో రాధికా ఆప్టే కీలక పాత్రలో నటించనుంది. స్టానా కాటిక్, సారా మేగాన్ లాంటి హాలీవుడ్ తారాలు నటిస్తున్న ఈ సినిమాలో రాధిక బ్రిటీష్ ఇంటలిజెన్స్ ఆఫీసర్‌గా కనిపించనుంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment