
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, మరిపెడ ( జయశంకర్ భూపాలపల్లి): డ్వాక్రా మహిళలకు చెందాల్సిన బ్యాంక్ లింకేజీ రుణాలు రూ.లక్షల్లో స్వాహా గురయ్యాయి. పోగు చేసుకున్న పొదుపు డబ్బులో ఏకంగా రూ.22లక్షలను ఐకేపీ విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్(వీఓఏ) భర్త కాజేశాడు. ఈ విషయం బయటపడడంతో మహిళలు ఆయనను గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్బంధించి ఆందోళనకు దిగిన ఘటన మరిపెడ మండలం ఉల్లెపల్లి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది.
వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ఉమ్మడి ఉల్లెపల్లిలో 38 పొదుపు సంఘాలు ఉండగా, ఇదే గ్రామానికి చెందిన వీఓఏ గోరెంట్ల రాణి బదులు ఆమె భర్త విష్ణు విధులు నిర్వర్తిస్తున్నారు. తొలుత అందరితో నమ్మకంగా మెదిలిన ఆయన బ్యాంకు లింకేజీ రుణాల్లోని కొంత మొత్తాన్ని తన ఖాతాల్లో వేసుకున్నాడు. ఈ విషయంపై అనుమానంతో సర్పంచ్ చిర్రబోయిన ప్రభాకర్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా 17 సంఘాలకు చెందిన రూ.22 లక్షలు వీఓఏ భర్త మాయం చేసినట్లు తేలడంతో గురువారం ఆయనను గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్బంధించి ఆందోళనక చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు చేరుకుని మహిళలను సముదాయించి విష్ణును పోలీస్ స్టేషన్ తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment