చోడవరం జనచైతన్య యాత్ర సభలో డ్వాక్రా మహిళల ఆగ్రహం
సాక్షి, విశాఖపట్నం: ‘‘ఏం మేలు చేశాడని చంద్రబాబుకు ఓటెయ్యాలో మీరే చెప్పండి. డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పారు. కానీ, చేయలేదు.రూ.లక్ష రివాల్వింగ్ ఫండ్ ఇస్తామన్నారు... ఇవ్వలేదు. కనీసం ఒక్కొక్కరికి రూ.10 వేలు ఇస్తామన్నారు. గతేడాది తొలి విడత జమ చేసిన రూ.3 వేలు చాలా మందికి అందలేదు. బ్యాంకువాళ్లు కొత్త రుణాలు ఇవ్వడం లేదు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని సైకిల్‌కు ఓట్లేయమని అడుగుతున్నారు’’ అని డ్వాక్రా మహిళలు మండిపడ్డారు.
డ్వాక్రా సంఘాలను నేనే పెట్టా: సీఎం
విశాఖ జిల్లా చోడవరంలో అధికార టీడీపీ ఆధ్వర్యంలో గురువారం జనచైతన్య యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. డ్వాక్రా సంఘాలకు తాను అనేక విధాలుగా ఆదుకున్నానంటూ చెప్పుకొచ్చారు. డ్వాక్రా మహిళలకు ఎంతగానో మేలు చేసిన తెలుగుదేశం పార్టీని 2019లో మళ్లీ గెలిపించాలి.. సైకిల్‌కే ఓట్లేయాలంటూ పార్టీ కార్యకర్తలు, డ్వాక్రా మహిళలతో చెప్పించే ప్రయత్నం చేశారు. సభకు హాజరైన డ్వాక్రా మహిళలు ఎలా ఓట్లేస్తాం అంటూ గట్టిగా ప్రశ్నించారు. అధికులు బాబు తీరుపై ఆగ్రహం వ్యక్తపరిచారు.
ఏం మేలు చేశాడని బాబుకు ఓటెయ్యాలి?
Published Fri, Nov 18 2016 1:09 AM | Last Updated on Tue, Aug 14 2018 3:47 PM
Advertisement